Gold, Silver Price Today: పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు
Gold, Silver Price Today: దేశంలో పసిడి ధరలు పెరుగుతున్నాయి. ఒక రోజు తగ్గితే మరోరోజు పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశంలో ధరల పెరుగుదలతో ఇబ్బందులు..
Gold, Silver Price Today: దేశంలో పసిడి ధరలు పెరుగుతున్నాయి. ఒక రోజు తగ్గితే మరోరోజు పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశంలో ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు.. బంగారం ధరలు మాత్రం రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ధరలు ఎంత పెరిగినా.. మహిళలు మాత్రం కొనుగోళ్లు జోరుగానే నిర్వహిస్తుంటారు. ఇక తాజాగా ఆగస్టు 6వ తేదీన దేశీయంగా తులం బంగారం ధరపై రూ.150 నుంచి రూ.250 వరకు పెరిగింది. ఇక వెండి ధర కిలోకు రూ.500లకుపైగా ఎగబాకింది. తాజాగా పెరిగిన ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.48,650 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.53,070 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,650 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,980 ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,800 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,140 వద్ద ఉంది. ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,980 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ52,040 ఉంది. ఇక కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,980 వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650 వద్ద ఉండా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980గా ఉంది. విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980 ఉంది.
వెండి ధరలు:
ఇక దేశీయంగా వెండి ధర కిలోకు రూ.58,200గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో కిలో వెండి ధర రూ.63,600 ఉండగా, ముంబైలో రూ.58,200 ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.63,600 ఉండగా, కోల్‌కతాలో రూ.58,200, బెంగళూరులో రూ.63,600, కేరళలో రూ.63,600, హైదరాబాద్‌లో రూ.63,600, విజయవాడలో రూ.63,600గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి