AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PAN Photo Change: పాన్‌ కార్డులో బ్లర్‌గా ఉండే మీ ఫోటోను మార్చాలనుకుంటున్నారా..? ఇలా చేయండి

PAN Photo Change: నేటి కాలంలో ఆధార్‌ కార్డు ఎంత ముఖ్యమో.. బ్యాంకు లావాదేవీలకు పాన్‌ కార్డు అంతే ముఖ్యం. పాన్‌ లేకపోతే బ్యాంకింగ్‌ రంగానికి చెందిన పనులతో పాటు..

PAN Photo Change: పాన్‌ కార్డులో బ్లర్‌గా ఉండే మీ ఫోటోను మార్చాలనుకుంటున్నారా..? ఇలా చేయండి
Pan Card
Subhash Goud
|

Updated on: Aug 08, 2022 | 9:11 AM

Share

PAN Photo Change: నేటి కాలంలో ఆధార్‌ కార్డు ఎంత ముఖ్యమో.. బ్యాంకు లావాదేవీలకు పాన్‌ కార్డు అంతే ముఖ్యం. పాన్‌ లేకపోతే బ్యాంకింగ్‌ రంగానికి చెందిన పనులతో పాటు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌కు సంబంధించిన ఏ పనులు జరగవు. ఆధార్‌, పాన్‌ లేకపోతే పనులన్ని నిలిచిపోతాయి. ఏదైనా ఆర్థిక లావాదేవీకి పాన్ కార్డ్ చాలా ముఖ్యం. అయితే పాన్‌ కార్డుల్లో మీ ఫోటో స్పష్టంగా కనిపించదు. అలాంటి సమయంలో పాన్‌లో మీ ఫోటోను కూడా మార్చుకోవచ్చు. ఫోటో బ్లర్‌గా దానిని సులభంగా మార్చుకోవచ్చు. మీరు ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్‌ లో మార్చుకోవచ్చు. అయితే దీని కోసం మీరు కొన్ని దశలను అనుసరించాలి. పాన్ కార్డ్‌లో బ్లర్ ఫోటోని మార్చే విధానాన్ని తెలుసుకుందాం.

పాన్ కార్డ్‌లో ఫోటో మార్చడం ఎలా:

☛ మీరు మీ పాన్ కార్డ్‌లోని ఫోటోను కూడా మార్చాలనుకుంటే ముందుగా మీరు NSDL అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.

ఇవి కూడా చదవండి

☛ ఇప్పుడు మీకు అప్లై ఆన్‌లైన్, రిజిస్టర్డ్ యూజర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీరు అప్లికేషన్ టైప్ ఆప్షన్‌కి వెళ్లి పాన్‌లో మార్చండి ఎంచుకోవాలి.

☛ దీని తర్వాత మీరు మార్పులు చేర్పులకు సంబంధించిన ఆప్షన్‌ను ఎంచుకుని అందులో అడిగే వివరరాలను నమోదు చేయాలి.

☛ దీని తర్వాత, కస్టమర్ క్యాప్చా కోడ్‌ను పూరించాలి. తర్వాత కేవైసీని పూర్తి చేయాలి.

☛ ఇప్పుడు మీరు స్క్రీన్‌పై రెండు ఆప్షన్స్‌ కనిపిస్తాయి. సిగ్నేచర్ సరిపోలడం, ఫోటో సరిపోలలేదు వంటి ఆప్షన్స్‌ కనిపిస్తాయి. ఇందులో ఉండే సమాచారాన్ని పూరించి కొనసాగించడంపై క్లిక్‌ చేయండి

☛ దీని తర్వాత మీరు కోరిన ID రుజువును సమర్పించి, డిక్లరేషన్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

☛ ఫోటోను ఆన్‌లైన్‌లో మార్చుకోవడానికి కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇలా రుసుము చెల్లింపును పూర్తి చేసిన తర్వాత ఫోటో మార్చే ప్రక్రియ పూర్తవుతుంది

☛ ఇప్పుడు చివరకు మీరు రసీదును పొందుతారు. దీని తర్వాత మీరు ఫోటోను మార్చడానికి నింపిన ఫారమ్ ప్రింటవుట్ తీసుకోవచ్చు. దానిని ఇన్‌కమ్ ట్యాక్స్ పాన్ సర్వీస్ యూనిట్‌కి పంపండి. ఇలా చేయడం వల్ల పాన్ కార్డ్‌లోని ఫోటో మారిపోతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఘరానా మొగుడు సినిమాకు చిరంజీవి రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారంటే..
ఘరానా మొగుడు సినిమాకు చిరంజీవి రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారంటే..
ఈ నక్షత్రాల్లో పుట్టినవారికి 40 ఏళ్లకే కోటీశ్వరులయ్యే అదృష్టం..!
ఈ నక్షత్రాల్లో పుట్టినవారికి 40 ఏళ్లకే కోటీశ్వరులయ్యే అదృష్టం..!
హోలికా ఎవరు...? కామ దహనం ఎందుకు చేస్తారో తెలుసా..? ఇది తెలిస్తేనే
హోలికా ఎవరు...? కామ దహనం ఎందుకు చేస్తారో తెలుసా..? ఇది తెలిస్తేనే
భారత్‌లోని ఈ ప్రాంతాల్లో గోల్డ్ ఫ్రీ.. ఫ్రీ.! ఎక్కడెక్కడంటే.?
భారత్‌లోని ఈ ప్రాంతాల్లో గోల్డ్ ఫ్రీ.. ఫ్రీ.! ఎక్కడెక్కడంటే.?
వీటిని పచ్చిగా తింటే మీ మెదడులోకి పురుగులు వెళ్లడం పక్కా..!
వీటిని పచ్చిగా తింటే మీ మెదడులోకి పురుగులు వెళ్లడం పక్కా..!
హోలీకి ప్రత్యేక రైళ్లు! పూర్తి టైమ్‌ టేబుల్‌ ఇదే!
హోలీకి ప్రత్యేక రైళ్లు! పూర్తి టైమ్‌ టేబుల్‌ ఇదే!
'డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు' వెబ్ సిరీస్ రివ్యూ..
'డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు' వెబ్ సిరీస్ రివ్యూ..
బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. నలుగురు దుర్మరణం..
బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. నలుగురు దుర్మరణం..
తొలి ట్రోఫీ గెలిచిన జమ్మూ కాశ్మీర్.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.?
తొలి ట్రోఫీ గెలిచిన జమ్మూ కాశ్మీర్.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.?
గుక్కపట్టి ఏడుస్తున్న పసిబిడ్డపై రామచిలుక మ్యాజిక్‌..! ఆ తర్వాత
గుక్కపట్టి ఏడుస్తున్న పసిబిడ్డపై రామచిలుక మ్యాజిక్‌..! ఆ తర్వాత