Dry Throat Causes: నీళ్లు తాగినా గొంతు తడారిపోతుందా..? ఆ సమస్యలకు సంకేతం కావొచ్చు..

చాలా మంది నీళ్లు తాగిన తర్వాత కూడా మళ్లీ మళ్లీ గొంతు పొడిబారడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిలో వాంతులు, తల తిరగడం వంటి సమస్యలు కూడా వస్తాయి.

Dry Throat Causes: నీళ్లు తాగినా గొంతు తడారిపోతుందా..? ఆ సమస్యలకు సంకేతం కావొచ్చు..
Dry Throat
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 07, 2022 | 2:00 PM

Dry Throat Causes: సాధారణంగా మన గొంతు తడారిపోయినప్పుడు, గొంతు నొప్పిగా ఉన్నప్పుడు ముందుగా నీటిని తాగుతాము. ఎందుకంటే నీరు తాగడం వల్ల గొంతు చల్లబడి తేమగా ఉంటుంది. కానీ, చాలా మంది నీళ్లు తాగిన తర్వాత కూడా మళ్లీ మళ్లీ గొంతు పొడిబారడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిలో వాంతులు, తల తిరగడం వంటి సమస్యలు కూడా వస్తాయి. మరోవైపు నీరు తాగిన తర్వాత కూడా మీ గొంతు పొడిగా ఉంటే, దానిని నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే దాని వెనుక చాలా కారణాలు ఉండవచ్చు. నీరు తాగిన తర్వాత కూడా గొంతు పొడిగా ఉంటే అప్పుడు ఏం జరుగుతుంది.. ఎలాంటి సమస్యలు వస్తాయి..? అనేవి తెలుసుకోండి..

నీరు తాగిన తర్వాత కూడా గొంతు పొడిబారడానికి కారణాలు ఇవి కావొచ్చు..

డీహైడ్రేషన్: గొంతు పొడిబారడానికి డీహైడ్రేషన్ కారణం కావచ్చు. మీ శరీరం డీహైడ్రేషన్ కు గురైనప్పుడు శరీరం అవసరమైనంత లాలాజలాన్ని ఉత్పత్తి చేయదు. అటువంటి పరిస్థితిలో పొడి గొంతు వంటి సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. అందువల్ల నీరు తాగిన తర్వాత కూడా నోరు పొడిబారడం సమస్య ఉంటే.. వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

ఇవి కూడా చదవండి

నోరు తెరిచి పడుకోవడం: రాత్రిపూట నోరు తెరిచి నిద్రిస్తే గొంతు పొడిబారడం సమస్య రావచ్చు. ఎందుకంటే నోరు తెరిచి నిద్రించడం వల్ల లాలాజలం, తేమ ఆరిపోతుంది. దీంతో నోరు, గొంతు పొడిగా ఉంటుంది. ఈ సమయంలో గురక, అలసట వంటి సమస్యలు కూడా ఉండవచ్చు.

జ్వరం, అలెర్జీలు: జ్వరం లేదా కాలానుగుణ అలెర్జీలు కూడా పొడి గొంతుకు కారణమవుతాయి. కాబట్టి నీరు తాగిన తర్వాత మీ గొంతు పొడిగా అనిపిస్తే అది కాలానుగుణ అలెర్జీలకు సంకేతం. ఈ సమయంలో ముక్కు కారడం, తుమ్ములు, దురద, దగ్గు వంటి సమస్యలు కూడా ఉండవచ్చు. అదే సమయంలో దీని కారణంగా నోటి ద్వారా శ్వాస తీసుకున్నా.. గొంతు కూడా పొడిబారిపోతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి