Male Fertility: ఈ ఒక్క చెడు అలవాటుతోనే పురుషుల్లో వంధత్వం.. లైంగిక సామర్థ్యం పెరగాలంటే ఇలా చేయండి..
పురుషుల్లో వంధ్యత్వ సమస్య రోజురోజుకు పెరుగుతున్నా.. చాలామంది పురుషులు ఈ సమస్య గురించి ఎవరితోనూ పంచుకోరు. పురుషుల్లో వంధత్వానికి సంబంధించిన చెడు అలవాట్లలో ముఖ్యమైనది మద్యం సేవించడం..

Reason For Male Infertility: పురుషులు వివాహం తర్వాత తమ దాంపత్య జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. కానీ కొన్ని అలవాట్లు వారి వైవాహిక జీవితాన్ని క్రమంగా నాశనం చేస్తాయి. శారీరకంగా బలహీనతతో ఉంటే వైవాహిక జీవితంలో ఇద్దరి మధ్య గ్యాప్ పెరుగుతుంది. ఇంకా పురుషులు తండ్రులుగా మారడంలో సమస్యలు ప్రారంభమవుతాయి. చాలా సందర్భాలలో.. ఇది బిజీ జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల జరుగుతుంది. పురుషుల్లో వంధ్యత్వ సమస్య రోజురోజుకు పెరుగుతున్నా.. చాలామంది పురుషులు ఈ సమస్య గురించి ఎవరితోనూ పంచుకోరు. పురుషుల్లో వంధత్వానికి సంబంధించిన చెడు అలవాట్లలో ముఖ్యమైనది మద్యం సేవించడం.. ఇది ప్రస్తుత కాలంలో లైఫ్‌స్టైల్ ట్రెండ్‌గా మారింది. కానీ, మనలో చాలా మందికి మద్యం తాగడం వల్ల కలిగే హాని గురించి తెలిసినా పట్టించుకోరు. మద్యం పురుషుల్లో వంధ్యత్వ సమస్యకు ఎలా కారణమవుతుంది.. ఏ విధంగా లైంగిక సామార్థ్యంపై ఎలా ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకోండి..
ఆల్కహాల్ తాగడం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది
ఆల్కహాల్ తాగడం అన్ని విధాలుగా హానికరం. దీనివల్ల కాలేయం దెబ్బతినే అవకాశం ఉంది. ఇంకా అన్ని రకాల సమస్యలను కలిగిస్తుంది. అయితే ఆల్కహాల్ పురుషుల సంతానోత్పత్తిపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని అందరికీ తెలియదు. ఆల్కహాల్ తాగడం వల్ల స్పెర్మ్ కౌంట్ పడిపోవడమే కాకుండా దాని నాణ్యత కూడా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఎక్కువ తాగే వారికి రిస్క్ కూడా అంతే పెరుగుతుంది. కావున ఈ వ్యసనాన్ని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది.




ఆల్కహాల్ తాగడం వల్ల లైంగిక జీవితం ఎలా ప్రభావితం అవుతుందో తెలుసుకోండి..
- మద్యపానం పురుషుల సంతానోత్పత్తిపై చెడు ప్రభావాన్ని చూపడమే కాకుండా, లైంగిక సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.
- ఆల్కహాల్ తీసుకోవడం టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిని తగ్గిస్తుంది. అలాగే స్పెర్మ్ ఏర్పడటానికి దోహదపడే హార్మోన్ల సమతుల్యతను మరింత దిగజార్చుతుంది.
- ఆల్కహాల్ ప్రభావం కారణంగా, ఆరోగ్యకరమైన స్పెర్మ్, ఆకార పరిమాణం, ప్రయాణ శక్తి తగ్గడం ప్రారంభమవుతుంది.
- ఆల్కహాల్ తాగడం వలన వృషణాల పరిమాణం తగ్గిపోతుంది. ఇది నేరుగా పురుషుల సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది.
- ఆల్కహాల్ తాగడం వల్ల స్ఖలనం తగ్గుతుంది లేదా అకాల స్కలనం ప్రమాదాన్ని పెంచుతుంది.
- ఇలాంటివారు ఆల్కహాల్ తాగడం మానేస్తే.. 3 నెలల్లో ఆరోగ్యకరమైన స్పెర్మ్ ఉత్పత్తి దానంతటదే ప్రారంభమవుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి