AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Food Mistakes: అన్నం తినేటప్పుడు ఈ నాలుగు పొరపాట్లను అస్సలు చేయకండి.. అలా చేస్తే ప్రమాదంలో పడినట్లే..

భోజనం చేసే సమయంలో కొన్ని పొరపాట్లను అస్సలు చేయకూడదని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. అలాచేయడం వల్ల ప్రయోజనానికి బదులుగా హాని కలిగించే అవకాశం ఉందంటున్నారు.

Food Mistakes: అన్నం తినేటప్పుడు ఈ నాలుగు పొరపాట్లను అస్సలు చేయకండి.. అలా చేస్తే ప్రమాదంలో పడినట్లే..
Food
Shaik Madar Saheb
|

Updated on: Aug 06, 2022 | 9:45 AM

Share

Mistakes While Having Meal: సాధారణంగా మనం రోజుకు కనీసం మూడు సార్లు భోజనం తింటాము. తద్వారా ఆరోగ్యంగా ఉంటాం. ఆహారం తినడం ద్వారా మన శరీరం శక్తిని పొందుతుంది. శరీరం అంతర్గత కార్యకలాపాలకు కూడా భోజనం చేయడం అవసరం. అయితే.. భోజనం చేసే సమయంలో కొన్ని పొరపాట్లను అస్సలు చేయకూడదని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. అలాచేయడం వల్ల ప్రయోజనానికి బదులుగా హాని కలిగించే అవకాశం ఉందంటున్నారు. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ టైం అనేది ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండాలి. ఆ సమయాన్ని తరచూ మార్పులు చేస్తే ఇబ్బందులు తప్పవు. ఇంకా ఆహారం తీసుకునేటప్పుడు కొన్ని తప్పులను అస్సలు చేయకూడదు. అన్నం తినే సమయంలో మనం చేయకూడని 4 తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తినేటప్పుడు ఈ పొరపాట్లను నివారించండి

1. భోజనానికి ముందు పెరుగుతినడం..

ఇవి కూడా చదవండి

పెరుగు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. సాధారణంగా పెరుగు ప్రభావం చల్లగా ఉంటుంది.. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. అయితే ఈ భోజనానికి ముందు అంటే ఖాళీ కడుపుతో తినకూడదు. ఎందుకంటే ఇది కడుపు ఆమ్లతను తగ్గిస్తుంది. పెరుగు ఎల్లప్పుడూ భోజనం తర్వాత తినాలి. ఇలా చేయడం ద్వారా ప్రోటీన్ మొత్తాన్ని పెంచుతుంది. కండరాలను అభివృద్ధి చేయడంతోపాటు బలపరుస్తుంది.

2. రాత్రి భోజనంలో అన్నం తినడం..

మన రోజువారీ ఆహారంలో అన్నం ముఖ్యమైనది. కానీ రాత్రిపూట తినకూడదు. బియ్యం కార్బోహైడ్రేట్ల గొప్ప మూలం. కావున ఇది జీర్ణక్రియకు సమయం పడుతుంది. ఇందులో ఉండే అధిక కేలరీలు కూడా బరువు పెరగడానికి కారణమవుతాయి.

3. చాలా వేడి పాలు తాగడం..

పాలలో దాదాపు అన్ని పోషకాలు దాగున్నాయి. అందుకే పాలను పూర్తి ఆహారంగా పరిగణిస్తారు. అయితే.. వేడి పాలు జీర్ణక్రియలో సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి చాలా వేడి పాలు ఎప్పుడూ తాగకూడదు. అయితే గోరువెచ్చని పాలు తాగడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు.

4. ఖాళీ కడుపుతో అరటిపండు తినడం..

అరటిపండు తినడం మన ఆరోగ్యానికి మేలు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఇంకా సరైన సమయంలో తినకపోతే దాని వల్ల నష్టం జరగడం ఖాయం. ఈ పండును ఖాళీ కడుపుతో ఎప్పుడూ తినకండి. ఇది శక్తిని హరించడం మాత్రమే కాకుండా డయేరియా, పేగు సిండ్రోమ్ వంటి సమస్యలను కూడా కలిగిస్తుంది. అరటిపండు కొద్దిగా కడుపు నిండినప్పుడే తినాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి