Milk Water Bath: పాలు కలిపిన నీళ్లతో స్నానం చేస్తే ఎన్ని ఉపయోగాలో.. చర్మం మెరిసిపోతుంది అంతే..
పాలు చాలా ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటాయి. ఈ ప్రొటీన్‌లో ఆరోగ్యకరమైన కొవ్వు, లాక్టిక్ యాసిడ్, కాల్షియం, విటమిన్ ఇ మొదలైనవి పుష్కలంగా ఉన్నాయి.
Benefits Of Bathing With Milk Water: పాలు తాగడం ఆరోగ్యానికి మేలు జరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. దీనిలోని కాల్షియం, ప్రొటీన్లు ఆరోగ్యంగా ఉంచడంతోపాటు.. ఎముకలను దృఢంగా మారుస్తాయి. అయితే.. పాలతో చర్మానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. చాలా మంది పాలను ముఖానికి, శరీరానికి మాయిశ్చరైజర్‌గా ఉపయోగిస్తారు. పాలు చాలా ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటాయి. ఈ ప్రొటీన్‌లో ఆరోగ్యకరమైన కొవ్వు, లాక్టిక్ యాసిడ్, కాల్షియం, విటమిన్ ఇ మొదలైనవి పుష్కలంగా ఉన్నాయి. దీని వల్ల మీ చర్మానికి పోషణ అందించడంలో సహాయపడుతుంది. అయితే ఎప్పుడైనా పాలను స్నానానికి ఉపయోగించారా? లేకపోతే.. ఈ విషయాల గురించి తప్పనిసరిగా తెలుసుకోండి. నీళ్లలో పాలు కలిపి స్నానం చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
నీటిలో పాలు కలిపి స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు..
పొడి చర్మం సమస్యను దూరం చేస్తుంది: పొడి చర్మం సమస్యతో ఆందోళన చెందుతుంటే రోజూ స్నానం చేసే నీటిలో అర గ్లాసు పాలు కలపి స్నానం చేయవచ్చు. ఇది చర్మాన్ని మాయిశ్చరైజింగ్ చేయడంలో సహాయపడుతుంది. ఎల్లప్పుడూ తేమ ఉండేలా చేస్తుంది. డ్రై స్కిన్‌ని దూరం చేయడంతో పాటు సాఫ్ట్ స్కిన్ అందిస్తుంది.
చర్మం మెరుస్తుంది: నీళ్లలో పాలు కలిపి తలస్నానం చేస్తే ముఖంపైనే కాకుండా శరీరం మొత్తం మెరుస్తుంది. అంతే కాదు ఇది శరీర ఛాయను మెరుగుపరుస్తుంది. దీనితో పాటు మచ్చలను దూరం చేస్తుంది. అదే సమయంలో ఇది చర్మం, టానింగ్‌ను కూడా తొలగిస్తుంది.
చర్మ అలర్జీలను దూరం చేస్తుంది: మీకు స్కిన్ అలర్జీ సమస్య ఉంటే నీరు, పాల మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల అలర్జీలు, దురద మొదలైన సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇది చర్మం బిగుతుగా మారడానికి కూడా కారణమవుతుంది. అంతే కాదు రోజూ పాల నీళ్లతో స్నానం చేస్తే వృద్ధాప్య లక్షణాలు కూడా తక్కువగా కనిపిస్తాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి