Crime News: ఎందుకమ్మా ఇలా చేశావ్‌.. కన్న బిడ్డను చంపిన తల్లి.. బాల్కానీ నుంచి కిందకు నెట్టి..

సంపంగిరామనగర్‌లోని సుధామనగర్‌లోని శ్రీనివాస్‌ కాలనీలోని అద్వైత్‌ ఆశ్రయ్‌ అపార్ట్‌మెంట్‌లో దంత వైద్యురాలు సుష్మ, ఆయన భర్త సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ దంపతులు నివసిస్తున్నారు.

Crime News: ఎందుకమ్మా ఇలా చేశావ్‌.. కన్న బిడ్డను చంపిన తల్లి.. బాల్కానీ నుంచి కిందకు నెట్టి..
Child Death
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 05, 2022 | 3:45 PM

Bengaluru Woman Throws Her 4-Year-Old Girl: క్షణికావేశంలో కొందరు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా.. ఓ కన్నతల్లి బిడ్డను నాలుగంతస్థుల భవనంపై నుంచి కింద పడేసింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే మరణించింది. అనంతరం ఆమె కూడా దూకేందుకు ప్రయత్నిస్తుండగా అపార్ట్‌మెంట్ వాసులు వెంటనే అక్కడికి చేరుకొని రక్షించారు. ఈ విషాద ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది. బెంగళూరు సంపంగిరామనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్లో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హత్యానేరం కింద సంపంగిరామనగర్‌ పోలీసులు ఆమెను అరెస్టు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంపంగిరామనగర్‌లోని సుధామనగర్‌లోని శ్రీనివాస్‌ కాలనీలోని అద్వైత్‌ ఆశ్రయ్‌ అపార్ట్‌మెంట్‌లో దంత వైద్యురాలు సుష్మ, ఆయన భర్త సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ దంపతులు నివసిస్తున్నారు. వారికి ఓ కూతురు ధృతి (4) ఉంది. పట్టుకతో బాలిక చెవిటి, మూగది (మానసిక వికలాంగురాలు). ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం 3.05 గంటల ప్రాంతంలో నాలుగో అంతస్తులోని బాల్కనీలో సుష్మ తన కుమార్తెతో కలిసి నడుస్తూ కనిపించింది. ఒక్క నిమిషం నడిచిన తర్వాత కూతుర్ని పట్టుకొని కింద పడేసింది. అపార్ట్‌మెంట్‌లో అమర్చిన సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యాలన్నీ రికార్డయ్యాయి. కూతుర్ని కిందపడేసిన అనంతరం గ్రిల్స్‌పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. గమనించిన పక్కింటి వారు ఆమెను కాపాడినట్లు పోలీసులు తెలిపారు. ఆమె భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బాలిక మానసిక వికలాంగురాలు కావడంతో మహిళ తీవ్ర మనస్థాపానికి గురైనట్లు పేర్కొంటున్నారు. సుష్మ మానసిక ఆరోగ్యం గురించి కూడా పరిశీలిస్తున్నట్లు సీనియర్ పోలీసు అధికారి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరికొన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..