క్లబ్‌లో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం.. 13 మంది మృతి,35 మందికి పైగా గాయాలు..

రద్దీగా ఉండే మ్యూజిక్ పబ్‌లో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. జరిగిన ప్రమాదంలో దాదాపు13 మంది మరణించారు. పదుల సంఖ్యలో

క్లబ్‌లో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం.. 13 మంది మృతి,35 మందికి పైగా గాయాలు..
Fire Broke
Jyothi Gadda

|

Aug 05, 2022 | 5:26 PM

రద్దీగా ఉండే మ్యూజిక్ పబ్‌లో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. జరిగిన ప్రమాదంలో దాదాపు13 మంది మరణించారు. పదుల సంఖ్యలో పబ్బుకు వచ్చిన ప్రజలు గాయపడ్డారు.ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ప్రజలు పబ్బు నుండి పరుగులు తీస్తున్నారు. తలుపు నుండి దట్టమైన నల్లటి పొగలు రావడం, ప్రజలు బయటికి పరిగెత్తుతున్నారు. ప్రవేశ ద్వారాలు సైతం పూర్తిగా మంటల్లో చిక్కుకున్నాయి. పబ్ నుంచి బయటకు వెళ్లే సమయంలో పలువురి దుస్తులకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటన థాయ్‌లాండ్‌లోని ఓ నైట్‌ క్లబ్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

థాయ్‌లాండ్‌లోని ఛన్​బురి రాష్ట్రం, సట్టాహిప్​జిల్లాలోని మౌంటెన్​బీ నైట్‌ క్లబ్‌లో అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికి తీసి.. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. బ్యాంకాక్‌కు ఆగ్నేయంగా 160 కిలోమీటర్లు (100 మైళ్లు) దూరంలో ఉంటుంది ఈ క్లబ్‌.

పోలీసు కల్నల్ వుటిపాంగ్ సోమ్‌జై తెలిపిన వివరాల ప్రకారం..మౌంటెన్ బీ నైట్‌క్లబ్‌లో నిన్న రాత్రి 1 గంట సమయంలో మంటలు చెలరేగాయి. మృతులంతా థాయ్‌లాండ్‌ పౌరులేనని చెప్పారు. మంటల్లో కాలిపోవడం వల్ల 40 మంది చనిపోయారని అధికారులు వెల్లడించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మంటల వీడియోలో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. తమ ప్రాణాలు కాపాడుకోవాలని ప్రజలు కేకలు వేయడం కనిపించింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu