తెలంగాణ డాక్టర్లకు గుడ్‌న్యూస్‌.. అలా చేసిన ప్రతిసారీ రూ.3 వేలు ప్రోత్సాహకం.. జీవో విడుదల

తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పేద, మధ్య తరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తెచ్చింది. దాంతో దేశంలోనే ఆరోగ్య సేవల్లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది.

తెలంగాణ డాక్టర్లకు గుడ్‌న్యూస్‌.. అలా చేసిన ప్రతిసారీ రూ.3 వేలు ప్రోత్సాహకం.. జీవో విడుదల
Normal Pregnancy
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 05, 2022 | 2:02 PM

ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలను ప్రోత్సహిస్తూ తల్లీబిడ్డల సంక్షేమానికి వైద్య సిబ్బంది కృషి చేస్తున్నారు. సాధారణ ప్రసవాలు చేస్తే ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుంది. ఆపరేషన్లు చేసి కాన్పులు చేస్తే ప్రభుత్వం అందించే కేసీఆర్‌ కిట్‌, నగదు పథకాలు నిలిపేస్తామని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పేద, మధ్య తరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తెచ్చింది. దాంతో దేశంలోనే ఆరోగ్య సేవల్లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. మదర్‌ మెర్టాలిటీ తగ్గించండంలో తమిళనాడును తెలంగాణ అధిగమించింది. ఈ క్రమంలోనే సాధారణ ప్రసవాలు ప్రోత్సహించడంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ ప్రసవాలు చేసిన వైద్య బృందానికి రూ. 3000 ఇన్సెంటివ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సర్కార్‌ జీవో విడుదల చేసింది. జీవోల నివేదించిన వివరాల ప్రకారం..

నార్మల్ డెలివరీ పట్ల అవగాహన పెంచుకోవాలి. డాక్టర్లే ఆపరేషన్ చేయాలా వద్దా అన్నది నిర్ణయిస్తారు. కొద్ది ముంది ముహూర్తం చూసుకొని ఆపరేషన్లు చేయమంటున్నారు. మరి కొద్ది మంది గర్బిణీ స్త్రీల కుటుంబ సభ్యులు- మా బిడ్డ పురిటి నొప్పులు పడలేదు ఆపరేషన్ చేయమని ఒత్తిడి చేస్తున్నరు.

ప్రాణాపాయం బట్టి ఆపరేషన్ చేయాలా వద్దా అన్నది డాక్టర్లు నిర్ణయిస్తారు. గర్భిణీ స్త్రీలకు కొంత ఫిజికల్ ఎక్సైర్ సైజ్ చేయాల్సి ఉంది. బాగా అభివృద్ధి చెందిన దేశాల వారు కార్పోరేట్ ఆసుపత్రుల్లో నార్మల్ డెలివరీ కోసం లక్షలు ఖర్చు పెట్టి ప్రత్యేకమైన ఆసుపత్రుల్లో జాయిన్ అవుతున్నారు. మనమేమో లక్షలు ఖర్చు పెట్టి కార్పోరేట్ ఆసుపత్రులకు వెళ్లి సి- సెక్షన్ ఆపరేషన్లు చేయించుకుంటున్నాం.

ఇవి కూడా చదవండి

నార్మల్ డెలివరీల వల్ల కలిగే లాభాలను యూరోపియన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల వారు గుర్తించారు. తల్లికి, శిశువుకు నార్మల్ డెలివరీ వల్ల క్షేమం. మొదటి గంటలో తల్లి పాలు, ఆరు నెలల పాటు అందడం వల్ల శిశు మరణాల రేటు 22 శాతం తగ్గించవచ్చని సర్వేలు చెబుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో45 శాతం సి సెక్షన్ జరుగుతోందన్నారు మంత్రి హరీశ్‌రావు. పెట్ల బురుజు ప్రభుత్వ ఆస్పత్రిలో మిల్క్‌ బ్యాంక్‌ ప్రారంభించిన మంత్రి హరీశ్‌ రావు ఈ మేరకు వివరించారు. మన దగ్గర 55 శాతం నార్మల్ డెలివరీ జరుగుతోంది. ప్రయివేటు లో 80 శాతం సి సెక్షన్, 20 శాతం నార్మల్ డెలివరీ జరుగుతోంది. ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో నార్మల్ డెలివరీ శాతం తగ్గాలి. ఇంతకు ముందు 75 శాతం సి సెక్షన్ జరిగేది. దాన్ని 45 శాతానికి తగ్గించగలిగాం. అందరం కలిసి ఆరోగ్య తెలంగాణ దిశగా సాగుదామని పిలుపునిచ్చారు. మన హెల్త్ సర్వీసెస్ లో తెలంగాణ రాష్ట్రం దేశంలో 3వ స్థానంలో ఉంది. కేరళ, తమిళనాడు తర్వాత తెలంగాణ ఉంది. ఇది కేంద్రం చెప్పింది.

మదర్ మోర్టాలిటీ రేట్ లో తమిళనాడును అధిగమించగలిగామన్నారు. సి సెక్షన్ చేస్తే 11 వేల రూపాయలు ఇచ్చేవాళ్లం. నెగిటెవ్ ఇంక్రిమెంట్. దాన్ని తొలగించి. ప్రతీ నార్మల్ డెలివరీకి 3 వేల రూపాయలు ఇంక్రిమెంట్ ఇస్తున్నం. డాక్టర్లు, నర్సులు, ఆశాలు, ఎ.ఎన్.ఎంలకు ఈ ప్రోత్సాహకం అమలు చేస్తున్నామని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి