పుట్టిన బిడ్డకు తల్లిపాలు శ్రీరామరక్ష.. మిల్క్‌ బ్యాంక్‌ ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు

తల్లి పాలే ముద్దు-డబ్బా పాలు వద్దు అనే నినాదంతో ఆగస్టు 1 నుండి 7వ తేదీ వరకు ప్రపంచ వ్యాప్తంగా డబ్ల్యూహెచ్‌వో తల్లిపాల వారోత్సవాలు..

పుట్టిన బిడ్డకు తల్లిపాలు శ్రీరామరక్ష.. మిల్క్‌ బ్యాంక్‌ ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు
Mother Milk
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 05, 2022 | 1:46 PM

మొదటి గంట తల్లి పాలు బిడ్డకు పట్టిస్తే అది మొదటి టీకాతో సమానం అవుతుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. హైదరాబాద్‌లోని పెట్ల బురుజు ప్రభుత్వ ఆస్పత్రిలో తల్లిపాల వారోత్సవాల్లో పాల్గొన్నారు మంత్రి హరీశ్‌రావు..ఈ సందర్భంగా పెట్ల బురుజు ప్రభుత్వ ఆసుపత్రిలో మిల్క్ బ్యాంక్ ప్రారంభించారు.  తల్లి పాలే ముద్దు-డబ్బా పాలు వద్దు అనే నినాదంతో ఆగస్టు 1 నుండి 7వ తేదీ వరకు ప్రపంచ వ్యాప్తంగా డబ్ల్యూహెచ్‌వో తల్లిపాల వారోత్సవాన్ని జరుపుతోంది. ఎ.ఎన్. సి చెకప్‌కు వచ్చినప్పటి నుండి తల్లి పాల శ్రేష్టత తెలిపేందుకు ఈ వారోత్సవాలు కొనసాగిస్తున్నారు. తల్లుల్లో అవగాహన పెంచాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..

ప్రపంచంలో 88 శాతం మంది తల్లులు ఆరు నెలల పాటు తమ పిల్లలకు పాలు ఇచ్చే దేశం బంగ్లాదేశ్. గ్రీన్ నేషన్‌గా బంగ్లాదేశ్ ను డబ్ల్యూహెచ్ వో గుర్తించింది. మన దేశంలో కూడా ఇస్తున్నారు. కేవలం 36 శాతం మంది మత్రమే మొదటి గంటలో తల్లి పాలు ఇస్తున్నారు. 64 శాతం మంది పిల్లలు మొదటి గంటలో తల్లి పాలకు దూరం అవుతున్నారు. తొలి గంటలో బిడ్డకు ఇచ్చే పాలు టీకాలతో సమానం. ప్రతీ తల్లీ గమనించాలి. తల్లుల్లో అవగాహన లేకపోవడం వల్ల డబ్బా పాలు ఇస్తున్నారు. సీ సెక్షన్ ఆపరేషన్ల వళ్ల ఇది జరుగుతోంది. తల్లి పాలు ముద్దు- డబ్బా పాలు వద్దు అన్న నినాదంతో ముందుకు పోవాలని మంత్రి హరీశ్‌ రావు సూచించారు.

శిశు మరణాలు తగ్గాలంటే తల్లి పాలు మొదటి గంటలో అందాలి. ఆరు నెలల పాటు నిరంతరాయంగా బిడ్డకు తల్లిపాలనే పట్టాలి. ఇవి మీరు దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎ.ఎన్.ఎంలు, ఆశా వర్కర్లు, సర్పంచ్ లు గ్రామ గ్రామాన తల్లి పాల వారోత్సవాల ప్రాముఖ్యత వివరిస్తున్నారు. తెలంగాణ రాక ముందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 శాతం కాన్పులు మాత్రమే అయ్యేవి. ఇప్పుడు 61 శాతం కాన్పులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్నాయి. ఇది గతంతో పోల్చితే రెట్టింపు అయింది. ప్రభుత్వ ఆసుపత్రుల మీద నమ్మకం పెంచగలిగామన్నారు మంత్రి హరీశ్‌రావు. శానిటేషన్ చార్జీలు పెంచాం. ఒక మంచానికి నెలకు 5 వేల రూపాయల నుండి 7500 రూపాయలకు శానిటేషన్ ఖర్చు పెంచాం. శానిటేషన్ సిబ్బంది వేతనాలు పెంచాం. ఈ నెల నుంచి మీకు అవి అందుతాయి. ఈఎస్ఐ ఉంటుంది. పీఎఫ్ ఉంటుంది. శానిటేషన్ సిబ్బందిపై ఏదైనా ఆరోపణలు వస్తే, సూపరింటెండెంట్లు కఠిన చర్యలు తీసుకునే అధికారం ఇస్తున్నాం. డబ్బులు రోగులను అడిగినట్లు తెలిస్తే ఇంటికి పంపడమే ఉంటుంది. దీనిపై నిత్యం పర్యవేక్షణ ఉంటుందన్నారు. మంత్రిగా తాను ఆకస్మిక తనిఖీలు చేపడాతమన్నారు. అధికారులు తనిఖీ చేస్తారని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

అవసరమైన స్కానింగ్ లన్నీ ఇక్కడే చేయాలి. బయటకు పంప వద్దు . అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.. ఒక్క రోగి బయటకు వెళ్లవద్దు. మందుల కోసం కూడా బయటకు వెళ్లకుండా చూసుకోవాలన్నారు. న్యూ బోర్న బేబీకి అవసరమైన చికిత్స, మందులు అందుబాటులోకి తెచ్చామన్నారు.. నిధులకు కొరత లేదు. నమ్మకాన్ని పెంచాలి. ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రజలు పెద్దఎ త్తున వచ్చే…న్యూ బోర్న్ బేబీకి అవసరమైన చికిత్స, మందులు అందుబాటులోకి తెచ్చాం. నిధులకు కొరత లేదు. నమ్మకాన్ని పెంచాలి. ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రజలు పెద్దఎ త్తున వచ్చేలా ప్రయత్నం చేద్దాం. బెడ్ల సంఖ్యను పెంచాలని అడిగారు. స్టాఫ్, మందులు ఎవి కావాలో సమీక్ష జరిపి చెప్పండి. అవన్నీ ప్రభుత్వం సమకూరుస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి ఏం కావాలన్నా అది అందుబాటులో ఉంచుతామన్నారు.. అలాగే ఏదైనా తప్పులు చేస్తే ప్రభుత్వం అంతే కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. గాంధీని, నిమ్స్ ను బలోపేతం చేస్తున్నామన్నారు. గాంధీ, నిమ్స్ లలో చేరో 250 పడకల ఎంసీహెచ్ ఆసుపత్రిని తెస్తున్నం. క్రిటికల్ కేసులు ప్రయివేటుకు వెళ్లకుండా అక్కడ చికిత్స అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 10 నుండి 10 శాతం రెఫరల్ జరుగుతోందని చెప్పారు. రెఫరల్ పై ఆడిట్ కూడా జరగాలి. ఎందుకు రిఫర్ చేశారన్నదానిపైన సమీక్ష జరపాలి. ఏదైనా పరిస్థితి చేయి దాటే కేసులు తప్ప రిఫరల్ చేయవద్దు.

శానిటేషన్ సిబ్బంది నుండి సూపరింటెండెంట్ వరకు బాగా పని చేస్తే ప్రభుత్వం గుర్తిస్తుంది. అదే రీతిలో తప్పులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటుంది. గైనిక్ కేసులో ఒక్క గర్భిణీని రెఫరల్ పంపడం లేదని వైద్యులు చెప్పారు. వారికి అభినందనలు. ప్రభుత్వం ఇదే కోరుకుంటుంది. ప్రతీ కేసు నమ్మకం పోకుండా నాణ్యమైన చికిత్స అందించాలని సూచించారు.

అనాథ పిల్లల కడుపు నింపిన నాగ చైతన్య అభిమానులు.. వీడియో ఇదిగో
అనాథ పిల్లల కడుపు నింపిన నాగ చైతన్య అభిమానులు.. వీడియో ఇదిగో
హాఫ్ సెంచరీతో కోహ్లీ బీభత్సం.. ఆందోళనలో అనుష్క
హాఫ్ సెంచరీతో కోహ్లీ బీభత్సం.. ఆందోళనలో అనుష్క
ఆసీస్ కొంపముంచిన ఉస్మాన్ ఖవాజా.. ఆ క్యాచ్ పట్టుంటే
ఆసీస్ కొంపముంచిన ఉస్మాన్ ఖవాజా.. ఆ క్యాచ్ పట్టుంటే
మార్కెట్లోకి వచ్చేస్తున్న ఇంట్రెస్టింగ్ ఫోన్‌.. స్టన్నింగ్‌ ఫీచర్
మార్కెట్లోకి వచ్చేస్తున్న ఇంట్రెస్టింగ్ ఫోన్‌.. స్టన్నింగ్‌ ఫీచర్
వీటిని ఒక చెంచా తేనెలో కలిపి తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
వీటిని ఒక చెంచా తేనెలో కలిపి తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
తన ప్రాణాలు కాపాడిన వారికి పంత్ ఏం గిఫ్ట్ ఇచ్చాడంటే?
తన ప్రాణాలు కాపాడిన వారికి పంత్ ఏం గిఫ్ట్ ఇచ్చాడంటే?
బడా హీరోలతో నటించిన ఈ చిన్నది ఎవరో తెలుసా.?
బడా హీరోలతో నటించిన ఈ చిన్నది ఎవరో తెలుసా.?
సర్వే బృందంపై రాళ్లు, చెప్పులతో దాడి.. షాకింగ్ వీడియో వైరల్‌
సర్వే బృందంపై రాళ్లు, చెప్పులతో దాడి.. షాకింగ్ వీడియో వైరల్‌
అప్పుడు చిన్నోడు.. ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
అప్పుడు చిన్నోడు.. ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
దారితప్పి వచ్చిన పెద్ద పులి.. దారుణంగా దాడి చేసిన జనం.. చివరకుఇలా
దారితప్పి వచ్చిన పెద్ద పులి.. దారుణంగా దాడి చేసిన జనం.. చివరకుఇలా