Telangana: చేనేతలో మెరిసిన సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి స్మితా.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
చేనేత రంగాన్ని (Handloom Sector) అభివృద్ధి పరచే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. ఈ మేరకు చేనేత వస్త్రాల వాడకాన్ని ప్రోత్సహించే దిశగా.. ముందడుగు వేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి సోమవారం చేనేత ఉత్పుత్తులను..
చేనేత రంగాన్ని (Handloom Sector) అభివృద్ధి పరచే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. ఈ మేరకు చేనేత వస్త్రాల వాడకాన్ని ప్రోత్సహించే దిశగా.. ముందడుగు వేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి సోమవారం చేనేత ఉత్పుత్తులను ధరించాలని కోరింది. అందులో భాగంగా సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్(Smita Sabharwal) మందుకు వెళ్తున్నారు. ప్రతిరోజూ చేనేత వస్త్రాలు ధరిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. చేనేత వస్తువులను ప్రోత్సాహించేందుకు తన వంతు కృషి చేస్తానని, వీటికి మార్కెటింగ్ కల్పించేందుకు తనకు తెలిసిన డిజైనర్లు, సంస్థలతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆమె వెల్లడించారు. అరుణ్య స్వచ్ఛంద సంస్థకు తాను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటానని గతంలో స్మితా సబర్వాల్ ప్రకటించారు. చేనేత కళ పూర్వీకులు మనకిచ్చిన సంపద.. కొనుగోలు శక్తి ఉన్నవారు ఏడాదికి ఒక్కసారైనా చేనేత చీర కొనాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. చేతితో, మగ్గంపై జాగ్రత్తగా, అందంగా తయారు చేసిన వివిధ రకాల వస్తువులు, ఫుడ్ ఐటమ్స్, చీరల డిజైనింగ్, ఇతరత్రా వస్తువులను అరుణ్య సంస్థ ద్వారా ఆన్‌లైన్, ఆఫ్ లైన్‌లో విక్రయిస్తారు.
మృదుత్వం, సహజత్వం, నాణ్యత, మన్నిక, సంస్కృతి, సంప్రదాయం చేనేతలోనే ఉన్నాయి. అన్ని శుభకార్యాల్లోనూ నేత వస్త్రాలనే కట్టుకోవాలని ప్రజలకు ప్రభుత్వం పిలుపునిచ్చింది. చేనేతను ప్రధానరంగంగా ప్రభుత్వం గుర్తించింది. అందుకే ఆ రంగాన్ని సీఎంవో ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ తనవంతుగా ప్రోత్సహిస్తున్నారు. ప్రతి రోజు చేనేత వస్త్రాలు ధరిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు స్మితా సబర్వాల్. కాగా.. ఆమె వస్త్రధారణను నెటిజన్లు సైతం మెచ్చుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..