Nalgonda: నల్లొండ జిల్లాలో కాల్పుల కలకలం.. బైక్‌పై వెళ్తున్న యువకుడిపై దుండగుల ఫైరింగ్‌..!

Nalgonda: తెలంగాణలోని నల్గొండ జిల్లాలో కాల్పుల కలకలం రేపింది. బైక్‌పై వెళ్తున్న ఓ యువకుడిపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. దుండగులు యువకుడిపై..

Nalgonda: నల్లొండ జిల్లాలో కాల్పుల కలకలం.. బైక్‌పై వెళ్తున్న యువకుడిపై దుండగుల ఫైరింగ్‌..!
Follow us
Subhash Goud

|

Updated on: Aug 04, 2022 | 11:07 PM

Nalgonda: తెలంగాణలోని నల్గొండ జిల్లాలో కాల్పుల కలకలం రేపింది. బైక్‌పై వెళ్తున్న ఓ యువకుడిపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. దుండగులు యువకుడిపై మూడు రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ కాల్పుల్లో యువకుడికి తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన మునుగోడు మండలం ఊకొండి శివారులో చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. అయితే బాధితుడు బ్రాహ్మణవెళ్లెంల గ్రామానికి చెందిన లింగస్వామిగా గుర్తించారు పోలీసులు. యువకుడి చేయిలోంచి బుల్లెట్‌ దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల వెనుక అసలు కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

దుండగుల కోసం గాలింపు చర్యలు

దుండగుల కాల్పులు ఒక్కసారిగా ఉలిక్కపడేలా చేశాయి. రంగంలోకి దిగిన పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దుండగులు యువకుడిపై కాల్పులు ఎందుకు జరిపారు..? కారనాలు ఏమై ఉంటాయన్నదానిపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి