Andhra Pradesh: డ్రైవర్ లేకుండానే దూసుకెళ్లింది.. కారును ఢీ కొట్టి ఆగిపోయింది.. కట్ చేస్తే

"ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం".. ఇది నిత్యం మనకు బస్సుల్లో (APSRTC) కనిపించే నినాదం. అయితే అలాంటి వాక్యాలు, మాటలు కేవలం బోర్డులకే పరిమితమయ్యాయి. క్షేత్రస్థాయిలో అవి అమలు అవడం లేదు. ప్రయాణికులను..

Andhra Pradesh: డ్రైవర్ లేకుండానే దూసుకెళ్లింది.. కారును ఢీ కొట్టి ఆగిపోయింది.. కట్ చేస్తే
Bus Accident In Kavali
Follow us

|

Updated on: Aug 04, 2022 | 1:29 PM

“ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం”.. ఇది నిత్యం మనకు బస్సుల్లో (APSRTC) కనిపించే నినాదం. అయితే అలాంటి వాక్యాలు, మాటలు కేవలం బోర్డులకే పరిమితమయ్యాయి. క్షేత్రస్థాయిలో అవి అమలు అవడం లేదు. ప్రయాణికులను భద్రంగా గమ్యస్థానానికి చేర్చాల్సిన ఆర్టీసీ ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. ఫలితంగా నిత్యం ఆర్టీసీ బస్సులు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ ఘటనల్లో ప్రయాణీకులు భారీ మూల్యాన్ని చెల్లించుకుంటున్నారు. కొందరు జీవచ్ఛవాల్లా మారితే.. మరికొందరు మాత్రం ప్రాణాలే కోల్పోతున్నారు. సరిగ్గా నెల్లూరు జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. నెల్లూరు జిల్లా కావలి పట్టణానికి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, కారు పరస్పరం ఢీ కొట్టుకున్నాయి. కండక్టర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఆ సమయంలో బస్సులో డ్రైవర్ లేకపోవడం గమనార్హం. ఓ కారు వేగంగా ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. జాతీయ రహదారిపై టోల్‌ప్లాజా వద్ద కావలి (Kavali) నుంచి నెల్లూరుకు వెల్తున్న బస్సును ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టింది.

ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 24 మంది ప్రయాణికులు ఉన్నారు. కారు వేగంగా ఢీ కొట్టడంతో బస్సు డ్రైవర్‌ ప్రసాద్‌.. డ్రైవింగ్ సీట్ నుంచి ఎగిరి రోడ్డు పై పడ్డారు. డ్రైవర్‌ లేకుండానే బస్సు ముందుకెళ్లింది. ఈ హఠాత్పరిణామానికి బస్సులో ఉన్న ప్రయాణికులు షాక్ అయ్యారు. భయంతో కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశారు. అప్పుడు బస్సులోనే ఉన్న కండక్టర్ నాగరాజు స్టీరింగ్‌ వద్దకు వెళ్లి బ్రేకులు వేయడంతో బస్సు ఆగింది. కాగా.. అప్పటికే బస్సు దాదాపు 150 మీటర్ల వరకు ముందుకెళ్లింది. కండక్టర్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా పది మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..