AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: పక్కింట్లోని ఓ వింత చెట్టు నుంచి ఘాటైన వాసన.. అనుమానంతో పోలీసులకు సమాచారం.. ఆరా తీయగా

అక్కడో.. ఇక్కడో తెచ్చుకోవాలంటే ఇబ్బంది అవుతుందని భావించినట్లు ఉన్నాడు. ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టాడు. కానీ ఘాటైన వాసన అతడిని దొరికిపోయేలా చేసింది.

Hyderabad: పక్కింట్లోని ఓ వింత చెట్టు నుంచి ఘాటైన వాసన.. అనుమానంతో పోలీసులకు సమాచారం.. ఆరా తీయగా
Representative image
Ram Naramaneni
| Edited By: Ravi Kiran|

Updated on: Aug 06, 2022 | 4:18 PM

Share

Telangana: మీరు బాగా గమనించే ఉంటారు. ఈ మధ్య గంజాయి ఎక్కడబడితే అక్కడ దొరుకుతుంది. విచ్చలవిడిగా స్మగ్లింగ్, అమ్మకాలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే రోజూ పదుల సంఖ్యలో మత్తు పదార్థాల అక్రమ రవాణా లేదంటే అమ్మకాలకు సంబంధించిన కేసులు నమోదవుతున్నాయి. పోలీసులు కళ్లుగప్పి.. ఈ గబ్బును ట్రాన్స్‌పోర్ట్ చేసేందుకు కేటుగాళ్లు పడుతున్న కథలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా హైదారాబాద్ నడిబొడ్డున ఓల్డ్ సిటీ(Old City)లోని ఓ ఇంట్లో 7 అడుగుల మేర పెరిగిన గంజాయి మొక్క కలకలం రేపింది. పాతబస్తీ జీఎం చావునీకి చెందిన మొహమ్మద్ అబ్దుల్ హై (62)  తన ఇంటిని గత కొంత కాలం క్రితం అన్వర్ సయ్యద్ మహమూద్‌కు అద్దెకు ఇచ్చాడు. అన్వర్ తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే నివశిస్తున్నాడు. అతని ఇంట్లో నుంచి చుట్టుపక్కల వాళ్లకు ఘాటైన వాసన వస్తుంది. దీంతో ఏంటా అని ఆరా తీయగా.. చిన్న.. చిన్న ఆకులతో 7 అడుగులు పెరిగిన చెట్టు కనిపించింది. దీంతో అనుమానం వచ్చి సీసీఎస్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బుధవారం సాయంత్రం కాప్స్ అతని ఇంటికి సడెన్ ఇంట్రీ ఇచ్చారు. అక్కడికి వచ్చి  చెక్ చేసి అది గంజాయి మొక్క అని నిర్ధారించారు. వెంటనే ఆ మొక్కను ధ్వంసం చేశారు. గంజాయి మొక్కకు ఎనిమిది నెలల వయస్సు ఉండవచ్చని తెలిపారు.  ఇంటి యజమానితో పాటు అద్దెకు ఉంటున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసును చార్మినార్ ఎక్సైజ్ పోలీసులు విచారిస్తున్నారు. మొక్కను కావాలనే పెంచినట్లు తేలితే.. నిందితులను బైండోవర్ చేస్తామని  తెలిపారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి