Andhra Pradesh: ఆనందంలో విషాదం.. మృత్యువు రూపంలో దూసుకొచ్చిన లారీ.. ఇద్దరు దుర్మరణం

ఆనకట్ట నుంచి నీటిని విడుదల చేయడంతో.. ఆ అపురూప దృశ్యాలను చూసేందుకు వచ్చారు. కానీ ఆ ఆనందం ఎంతో సమయం నిలవలేదు. లారీ రూపంలో ఎదురొచ్చిన మృత్యువు ఇద్దరు మహిళలను కబళించింది. అనంతపురం (Anantapur) జిల్లాలో..

Andhra Pradesh: ఆనందంలో విషాదం.. మృత్యువు రూపంలో దూసుకొచ్చిన లారీ.. ఇద్దరు దుర్మరణం
Accident
Follow us
Ganesh Mudavath

|

Updated on: Aug 05, 2022 | 7:28 AM

ఆనకట్ట నుంచి నీటిని విడుదల చేయడంతో.. ఆ అపురూప దృశ్యాలను చూసేందుకు వచ్చారు. కానీ ఆ ఆనందం ఎంతో సమయం నిలవలేదు. లారీ రూపంలో ఎదురొచ్చిన మృత్యువు ఇద్దరు మహిళలను కబళించింది. అనంతపురం (Anantapur) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెలుగుప్ప మండలం కాల్వపల్లి వద్ద పెన్నా నది వంతెనపై వేగంగా వచ్చిన లారీ మహిళలపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. పేరూరు ప్రాజెక్టు (Peruru Dam) గేట్లు ఎత్తడంతో పెన్నా నదిలోకి భారీగా వరద వస్తోంది. నీటిని చూసేందుకు వెళ్లిన మహిళలపై లారీ దూసుకెళ్లింది. ప్రమాదానికి కారణమైన లారీని పట్టుకునేందుకు గ్రామస్థులు శ్రమించి, చివరకు బోరంపల్లి-గోళ్ల గ్రామాల మధ్య పట్టుకున్నారు. తీవ్ర ఆగ్రహంతో వంతెనపై వాహనాల రాకపోకలను అడ్డుకున్నారుర. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మహిళలు మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రాజెక్టు చూసేందుకు వచ్చిన ఇద్దరు మహిళలు చనిపోవడంతో.. స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..

టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ