PM Ujjwala Yojana: 4.13 కోట్ల మంది లబ్ధిదారులు ఒక్కసారి కూడా సిలిండర్‌ను రీఫిల్ చేయలేదు: రాజ్యసభలో మంత్రి వెల్లడి
PM Ujjwala Yojana: ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు మండిపోతున్నాయి. ఈ ధరల పెరుగుదలతో సామాన్యుడికి భారంగా మారుతోంది. అయితే రాజ్యసభలో ఎల్పీజీ సిలిండర్ల..
PM Ujjwala Yojana: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు మండిపోతున్నాయి. ఈ ధరల పెరుగుదలతో సామాన్యుడికి భారంగా మారుతోంది. అయితే రాజ్యసభలో ఎల్పీజీ సిలిండర్ల వినియోగానికి సంబంధించి మోదీ ప్రభుత్వం కీలక గణాంకాలను విడుదల చేసింది. గత ఐదేళ్లలో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకంలో 4.13 కోట్ల మంది లబ్ధిదారులకు ఒక్క ఎల్‌పిజి సిలిండర్ కూడా రీఫిల్ చేయలేదని ప్రభుత్వం సభకు తెలిపింది. ఈ మేరకు పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలీ పార్లమెంట్‌లో లిఖితపూర్వకంగా వెల్లడించారు.
గత ఐదు సంవత్సరాలోల ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద ఎల్‌పిజి రీఫిల్ చేసిన లబ్ధిదారులు తక్కువగా ఉన్నారని రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి స్పందిస్తూ.. గత ఐదేళ్లలో ప్రధాన మంత్రి ఉజ్వల యోజనలో 4.13 కోట్ల మంది లబ్ధిదారులకు ఒక్క ఎల్‌పీజీ సిలిండర్ కూడా రీఫిల్ చేయలేదన్నారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజనలో మొత్తం 7.67 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారని, వీరికి కేవలం ఒక ఎల్‌పిజి సిలిండర్ మాత్రమే రీఫిల్ చేయబడిందని ఆయన చెప్పారు. 2018-19లో 1.24 కోట్లు, 2019-20లో 1.41 కోట్లు, 2020-21లో 0.10 కోట్లు, 2021-22లో 0.92 కోట్లు ఒక్కసారి కూడా సిలిండర్‌ను రీఫిల్ చేయలేదు. అలాగే 2018-19లో 2.90 కోట్లు, 2019-20లో 1.83 కోట్లు, 2020-21లో 0.67 కోట్లు, 2021-22లో 1.08 కోట్లు ఒక్కసారి మాత్రమే రీఫిల్ చేసినట్లు చెప్పారు.
ఎల్‌పిజి సిలిండర్ వినియోగం ప్రజలకు అందించే విధానం, ఇంట్లో నివసించే మొత్తం వ్యక్తుల సంఖ్య, ఇతర ఇంధన ఎంపికలపై ఆధారపడి ఉంటుంది. 2021-22లో మొత్తం 30.53 కోట్ల మంది యాక్టివ్ ఎల్‌పిజి కస్టమర్లలో 2.11 మంది డొమెస్టిక్ ఎల్‌పిజి కస్టమర్లు ఒక్క సిలిండర్ కూడా రీఫిల్ చేయలేదని ఆయన చెప్పారు. మొత్తం 2.91 కోట్ల మంది ఎల్‌పిజి వినియోగదారులు ఒకే సిలిండర్‌ను రీఫిల్ చేశారు. ప్రభుత్వం డొమెస్టిక్ ఎల్‌పిజి సిలిండర్ల ధరలను మాడ్యులేట్ చేస్తూనే ఉందని, అర్హులైన లబ్ధిదారులకు వారి ఖాతాల్లో సబ్సిడీ మొత్తాన్ని బదిలీ చేస్తుందని పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సభకు తెలిపారు. ఇది కాకుండా, మే 21, 2022న, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు 2022-23లో 12 సిలిండర్లు పొందేందుకు ప్రభుత్వం రూ.200 సబ్సిడీని ప్రకటించిందని వివరించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి