RINL Recruitment: ఐటీఐ విద్యార్థులకు మంచి అవకాశం.. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో అప్రెంటిస్‌ పోస్టులు.. ఇలా అప్లై చేసుకోండి..

RINL Recruitment: విశాఖపట్నంలో స్టీల్‌ ప్లాంట్‌ పలు అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (RINL)కు చెందిన ఈ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న అప్రెంటిస్‌ శిక్షణకు...

RINL Recruitment: ఐటీఐ విద్యార్థులకు మంచి అవకాశం.. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో అప్రెంటిస్‌ పోస్టులు.. ఇలా అప్లై చేసుకోండి..
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 04, 2022 | 7:17 PM

RINL Recruitment: విశాఖపట్నంలో స్టీల్‌ ప్లాంట్‌ పలు అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (RINL)కు చెందిన ఈ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న అప్రెంటిస్‌ శిక్షణకు దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 319 అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ఫిట్టర్ (80), టర్నర్ (10), మెషినిస్ట్ (14), వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్) – (40), మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ (MMTM) – (20), ఎలక్ట్రీషియన్ (65), కార్పెంటర్ (20), మెకానిక్ రిఫ్రిజిరేషన్ మరియు ఎయిర్ కండిషనింగ్ (R&AC) (10), మెకానిక్ డీజిల్ (30), కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA) (30) ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతితో పాటు సంబంధిత ట్రెడులలో ITI ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* విద్యార్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* జనరల్‌ అభ్యర్థులు రూ. 200, ఎస్‌సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ. 100 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. వివిధ కేటగిరీల వారికి రిజర్వేషన్ ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణకు 18-08-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 7,700 నుంచి రూ. 8,050 స్టైఫండ్‌గా చెల్లిస్తారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..