Crime: ఆ గ్రామంలో అనాగరిక తీర్పు.. అలా చేసిందని యువతిని ఏకంగా గ్రామం నుంచే బహిష్కరించారు

Jharkhand: మారుమూల గ్రామాల్లో ఇప్పటికీ పెద్దమనుషుల తీర్పే వేదవాక్కు. పోలీస్ స్టేషన్లకు వెళ్లకపోవడం, కోర్టు పద్ధతులు తెలియకపోవడంతో గ్రామంలో ఏ సమస్య ఎదురైనా పెద్దమనుషుల సమక్షంలోనే పరిష్కరించుకుంటూ ఉంటారు. అయితే..

Crime: ఆ గ్రామంలో అనాగరిక తీర్పు.. అలా చేసిందని యువతిని ఏకంగా గ్రామం నుంచే బహిష్కరించారు
Justice In Village
Follow us
Ganesh Mudavath

|

Updated on: Aug 05, 2022 | 9:01 AM

Jharkhand: మారుమూల గ్రామాల్లో ఇప్పటికీ పెద్దమనుషుల తీర్పే వేదవాక్కు. పోలీస్ స్టేషన్లకు వెళ్లకపోవడం, కోర్టు పద్ధతులు తెలియకపోవడంతో గ్రామంలో ఏ సమస్య ఎదురైనా పెద్దమనుషుల సమక్షంలోనే పరిష్కరించుకుంటూ ఉంటారు. అయితే.. వారు కొన్ని సార్లు వారూ వివాదాస్పద తీర్పులు వెల్లడిస్తుంటారు. తామే పెదరాయుళ్లమనే భావనతో, గ్రామంలో తాము చెప్పిందే జరుగుతుందనకుంటూ సమాజం అంగీకరించని విధంగా వ్యవహరిస్తారు. సరిగ్గా జార్ఖండ్ లో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ యువతి పట్ల అమానుషంగా ప్రవర్తించారు. అంతే కాకుండా ఆమె జరిమానా విధించి, గ్రామం నుంచి బహిష్కరించారు. ఇంతకీ ఆమె చేసిన తప్పిదం ఏమిటో తెలుసా.. ట్రాక్టర్ నడుపుతూ వ్యవసాయం చేయడమే. జార్ఖండ్ లోని గుమ్లా జిల్లా శివనాథ్‌పుర్‌ గ్రామానికి చెందిన ఓ యువతి తన కుటుంబంతో కలిసి నివాసముంటోంది. ఆర్థికంగా సమస్యలు ఎదురవడంతో ఆమె వ్యవసాయం చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటోంది. ఈ క్రమంలో ఓ పాత ట్రాక్టర్‌ను కొని స్వయంగా నడుపుతూ పొలం దున్నింది. దీనిని గమనించిన గ్రామస్థులు దారుణంగా వ్యవహరించారు. ఆమె ట్రాక్టర్ నడపడాన్ని నిలిపేయాలని సూచించారు.

మహిళలు ట్రాక్టర్‌ డ్రైవ్ చేస్తే గ్రామానికి చెడు జరుగుతుందని అనాగకరికంగా వ్యవహరించారు. దీని వల్ల గ్రామంలో కరవుకాటకాలు సంభవిస్తాయని, వెంటనే నిలిపివేయాలని హెచ్చరించారు. గ్రామ కట్టుబాట్లను అతిక్రమించినందుకు గానూ ఆమెకు జరిమానా విధించారు. పంచాయతీ నిబంధనలను ఉల్లంఘించినందుకు యువతిని గ్రామ బహిష్కరణ చేయాలని నిర్ణయించారు.అయితే.. గ్రామస్థుల తీర్మానాన్ని యువతి తిరస్కరించింది. పెద్ద మనుషులు ఇచ్చిన తీర్పును తాను ఒప్పుకోనని.. వ్యవసాయం చేస్తానని స్పష్టం చేసింది. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అలాంటప్పడు తాను వ్యవసాయం ఎందుకు చేయవద్దని ప్రశ్నిస్తోంది.

ఇవి కూడా చదవండి
Woman Expelled From Village

Woman Expelled From Village

మరిన్ని జాతీయ వార్తల కోసం