RBI: మరికాసేపట్లో ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశం.. తీసుకున్న రుణాలపై కీలక ప్రకటన.. లోన్ తీసుకున్నవారికి ఎఫెక్ట్..
RBI MPC Meeting: RBI రేట్లను పెంచినట్లయితే.. దాని ప్రభావం గృహ రుణం, కారు లోన్, పర్సనల్ లోన్ల EMI పెరుగె అవకాశం ఉంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మానిటరీ పాలసీ కమిటీ (MPC) ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఆర్‌బీఐ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. వరుసగా మూడోసారి రెపో రేటును పెంచే ఛాన్స్ ఉంది. మూడు రోజుల పాటు జరిగే సమావేశాల్లో హోమ్ లోన్‌లు తీసుకున్న వారి నెలవారీ వాయిదాల(EMI)పై కూడా కీలక నిర్ణయం తీసుకుంటుందన్ని అంచనా వేస్తున్నారు ఆర్ధిక నిపుణులు. 25 నుంచి 50 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఆర్బీఐ ఇప్పటికే ఈ ఏడాది మే నుంచి రెండుసార్లు రెపో రేట్లను మానిటరీ పాలసీ సమావేశాల్లో ఆర్‌బీఐ ద్రవ్య విధానాన్ని 90 బేసిస్ పాయింట్లు పెంచింది.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ మూడు రోజుల మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయాలను RBI గవర్నర్ శక్తికాంత దాస్ ఇవాళ ప్రకటించనున్నారు. నేటి క్రెడిట్ పాలసీలో, దేశంలోని సెంట్రల్ బ్యాంక్ RBI వరుసగా మూడోసారి రెపో రేటుతో సహా ఇతర పాలసీ రేట్లను పెంచుతుందని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం దేశంలో రెపో రేటు 4.90 శాతంగా ఉండగా, దానిని 0.50 శాతం పెంచడం ద్వారా 5.40 శాతానికి తగ్గించవచ్చు. అంటే మళ్లీ ఆగస్ట్ 2019 స్థాయికి చేరుకుంటుంది.
మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశం..
మీటింగ్ నిర్ణయాలపై అంచనాలు ఏంటి..? RBI మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు వెలువడనున్నాయి..? ఈ రోజు ఉదయం 10 గంటల తర్వాత తెలుస్తుంది. కానీ RBI రేట్లు పెంచితే ఇది ప్రభావం చూపుతుందని స్పష్టమవుతుంది హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్ EMIల ఈ ప్రభావం ఉంటుంది
గత వరుస పరపతి విధానంలో ఆర్‌బీఐ రేట్లు పెంచగా
అంతకుముందు మేలో ఆర్‌బీఐ రెపో రేటును 0.40 శాతం, జూన్‌లో 0.50 శాతం పెంచింది. దీని తర్వాత రెపో రేటు ప్రస్తుతం 4.90 శాతంగా ఉంది. నేడు దాని రేట్లు 0.35 శాతం లేదా 0.50 శాతం పెరిగితే, అది 5 శాతానికి మించి ఉంటుంది. ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయిలోనే ఉంది. వరుసగా ఆరు నెలలుగా ద్రవ్యవిధానం కమిటీ నిర్దేశిత స్థాయి కంటే ఎక్కువగా వస్తోందని నిపుణులు అంటున్నారు . ఇది కాకుండా, ఇటీవల US ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 75 బేసిస్ పాయింట్లు పెంచింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రిజర్వ్ బ్యాంక్ ఈ క్రెడిట్ పాలసీలో పాలసీ రేట్లను 0.40-0.50 శాతం పెంచవచ్చు.
ప్రస్తుతం హోమ్ లోన్‌లపై బ్యాంకులు ఇస్తున్న తాజా వడ్డీ రేట్లు ఇలా..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) 7.55 శాతం
సిటీ బ్యాంక్(CITY BANK) 6.65 శాతం
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(UBI) 7.40 శాతం
బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB) 7.45 శాతం
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Central Bank of India) 7.40 శాతం
బ్యాంక్ ఆఫ్ ఇండియా(BOI) 6.90 శాతం
కోటక్ మహీంద్రా బ్యాంక్(KOTAK MAHINDRA BANK) 7.50 శాతం
యాక్సిస్ బ్యాంక్(AXIS BANK) 7.60 శాతం
కెనరా బ్యాంక్ 7.05 శాతం
ఇవాళ సమావేశంలో తీసుకునే నిర్ణయాల ప్రభావం వీటిపై ఉంటుంది.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం..