Hyderabad: ‘నా మాటలన్నీ అబద్ధమే.. దయచేసి అర్థం చేసుకోండి’.. కంటతడి పెట్టిస్తోన్న ఇంజనీర్‌ విద్యార్థి సూసైడ్‌ లెటర్‌..

Hyderabad: జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకు షాకింగ్‌ నిర్ణయం తీసుకుంటూ కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిలిస్తున్నారు కొందరు. దేవుడిచ్చిన జీవితాన్ని ఎంతకష్టమొచ్చినా ఎదురించి..

Hyderabad: 'నా మాటలన్నీ అబద్ధమే.. దయచేసి అర్థం చేసుకోండి'.. కంటతడి పెట్టిస్తోన్న ఇంజనీర్‌ విద్యార్థి సూసైడ్‌ లెటర్‌..
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 05, 2022 | 2:36 PM

Hyderabad: జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకు షాకింగ్‌ నిర్ణయం తీసుకుంటూ కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిలిస్తున్నారు కొందరు. దేవుడిచ్చిన జీవితాన్ని ఎంతకష్టమొచ్చినా ఎదురించి అనుభావించాల్సి వారు కాడిని మధ్యలోనే వదిలేస్తున్నారు. ముఖ్యంగా యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతుండడం ఇటీవల తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. జీవితంలో అనుకున్నది సాధించలేదని కొందరు, అప్పుల ఊబిలో ఇరుక్కుపోయి మరికొందరు తనువు చాలిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ సంఘటన కలకలం రేపింది.

వరంగల్‌ జిల్లా కాశీబుగ్గకు చెందిన మామిడి లక్ష్మిసాయి (22) అనే కుర్రాడు ఇటీవలే బీటెక్‌ పూర్తి చేసి ఉద్యోగ ప్రయాత్నాలు చేస్తున్నాడు. ఇదే సమయంలో గతనెల 31న హైదరాబాద్‌కు వచ్చి గురుద్వారా ప్రాంతంలోని లోటస్‌ గ్రాండ్‌ హోటల్‌లో దిగాడు. రెండు రోజుల పాటు కనిపించకపోవడం, రూమ్‌ రెంట్‌ కూడా చెల్లించకపోవడంతో హోటల్‌ సిబ్బంది గురువారం లక్ష్మిసాయి ఉన్న గది తలుపు తట్టాడు. ఎంతకీ డోర్‌ తీయకపోవడంతో.. హోటల్‌ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తలుపులు బద్దలు కొట్టి చూడగా బాత్‌ రూమ్‌లో బైండింగ్‌ వైర్‌తో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు.

లక్ష్మీసాయి వద్ద సూసైడ్‌ నోట్‌ను పోలీసులు గుర్తించారు. ‘తెలిసీ తెలియక అప్పులు చేశా… వాటిని తీర్చేలేకపోతున్నా.. చాలా అబద్ధాలు చెప్పా.. నా మాటలన్నీ నాటకమే.. దయచేసి అర్థం చేసుకోండి.. అమ్మా, నాన్న, గుడి, తమ్ముళ్లు జాగ్రత్త’ అని సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్న సాయి తనువు చాలించాడు. లక్ష్మీసాయి ఫోన్‌ను తనిఖీ చేయగా చివరి ఫోన్‌కాల్‌ సోమవారం చేసినట్లు గుర్తించారు. దీంతో అతను సోమవారమే ఆత్మహత్య చేసుకున్నట్లు ఓ అంచనాకు వచ్చారు. సూసైడ్‌ నోట్‌లో ప్రస్తావించినట్లు అప్పులే ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన పోలీసులు విచారణ ప్రారంభించారు.

మరికొన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..