Haryana: కలకలం రేపుతున్న పేలుడు పదార్థాల కదలికలు.. హర్యానాలో భారీగా ఆర్డీఎక్స్ స్వాధీనం
ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో (Azadi Ka Amrit Mahotsav) భాగంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న సమయంలో పేలుడు పదార్థాల ఉనికి కలకలం రేపుతోంది. ఇండిపెండెన్స్ డే ఉత్సవాల్లో దేశం బిజీగా ఉన్న తరుణంలో వీటి..
ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో (Azadi Ka Amrit Mahotsav) భాగంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న సమయంలో పేలుడు పదార్థాల ఉనికి కలకలం రేపుతోంది. ఇండిపెండెన్స్ డే ఉత్సవాల్లో దేశం బిజీగా ఉన్న తరుణంలో వీటి కదలికలు కలకలం రేపుతున్నాయి. తాజాగా హర్యానా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. కురుక్షేత్ర జిల్లాలోని షహాబాద్ సమీపంలో సుమారు 1.3 కిలోల ఆర్డీఎక్స్ కలిగిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED)ను సీజ్ చేశారు. అంతే కాకుండా ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. టిఫిన్ బాక్స్‌లో అమర్చిన 1.3 కిలోల RDX, ఒక డిటోనేటర్, ఒక స్విచ్, బ్యాటరీని స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ విభాగం పేర్కొంది. రాష్ట్ర రాజధాని చండీగఢ్‌కు దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో అంబాలా-ఢిల్లీ జాతీయ రహదారిపై పేలుడు పదార్థాలను గుర్తించి పట్టుకున్నట్లు కురుక్షేత్ర సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) సురీందర్ సింగ్ వెల్లడించారు. అరెస్టైన వ్యక్తి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని, ఇటీవల ఐఈడీని ఉంచినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెప్పారు. వివిధ రకాల చట్టాల కింద అతనిపై కేసు నమోదు చేశారు.
కాగా.. హర్యానాలోని కర్నాల్ లో మే నెలలో పోలీసులు మేలో నలుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి 2.5 కిలోల బరువున్న మెటాలిక్ కేసులో ప్యాక్ చేసిన మూడు ఐఇడీలు, ఒక రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అంబాలా-చండీగఢ్ హైవేకు సమీపంలోని సదోపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల సమీపంలోని ఖాళీ ప్రాంతం నుంచి మార్చిలో మూడు లైవ్ హ్యాండ్ గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం