AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తనిఖీల్లో భాగంగా ఇన్నోవా కారును ఆపిన పోలీసులు.. కారులో దృశ్యాన్ని చూసి షాక్‌ అయిన ఖాకీలు..

Telangana: పోలీసులు ఎన్ని రకాల చర్యలు చేపడుతోన్న నేరాలు మాత్రం ఆగడం లేవు. పోలీసులు నిఘా నేత్రాలను తప్పించుకొని అక్రమార్కులు నేరాలకు పాల్పడుతున్నారు. గురువారం తెలంగాణలోని కోదాడ పట్టణంలో వెలుగు చూసిన...

Telangana: తనిఖీల్లో భాగంగా ఇన్నోవా కారును ఆపిన పోలీసులు.. కారులో దృశ్యాన్ని చూసి షాక్‌ అయిన ఖాకీలు..
Narender Vaitla
| Edited By: |

Updated on: Aug 06, 2022 | 4:36 PM

Share

Telangana: పోలీసులు ఎన్ని రకాల చర్యలు చేపడుతోన్న నేరాలు మాత్రం ఆగడం లేవు. పోలీసులు నిఘా నేత్రాలను తప్పించుకొని అక్రమార్కులు నేరాలకు పాల్పడుతున్నారు. గురువారం తెలంగాణలోని కోదాడ పట్టణంలో వెలుగు చూసిన స్మగ్లింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర పుణేకు చెందిన సుభాష్‌ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌లోని అరకు నుంచి గంజాయి అక్రమంగా తరలిస్తున్నాడు. ఇన్నోవా కారులో దర్జాగా గంజాయిను తరలిస్తుండగా.. కోదాడ పట్టణ పోలీసులు తనిఖీల్లో భాగంగా కారును ఆపి చూడగా గంజాయి కనిపించింది. దీంతో పోలీసులు విచారించగా సుభాష్‌ నేరాన్ని అంగీకరించి పూర్తి వివరాలు తెలిపాడు.

పుణేకు చెందిన ఆకాష్‌ ఉత్తమ్‌ రావు చౌహాన్‌ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌ను నుంచి గంజాయి తీసుకొని వస్తే రూ. 10 వేలు ఇస్తానని ఆశ చూపానని అందుకే తాను ఈ పని చేశానని సుభాష్‌ పోలీసులకు తెలిపాడు. నిందితుడి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ. 21 లక్షలు ఉంటుందని అంచనా. ఇక అసలు నేరస్థుడు ఆకాష్‌ ఉత్తమ్‌ రావు చహాన్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నేరస్తుడి నుంచి గంజాయి, సెల్ ఫోన్, ఇన్నోవా కారు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీస్‌ అధికారి తెలిపారు.

Crime News

మాస్టర్స్‌ చదివి.. దొంగదారి ఎంచుకొని..

పోలీసులకు దొరికి సుభాష్‌ పుణేలోని ఓ యూనివర్సిటీలో మాస్టర్స్‌ డిగ్రీని పూర్తి చేశాడు. అయితే విద్య పూర్తయిన తర్వాత ఉద్యోగం రాకపోవడంతో కారు డ్రైవర్‌గా మారాడు. డ్రైవర్‌గా వచ్చే సంపాదనతో కుటుంబాన్ని పోషించలేకపోవడంతో సుభాష్‌ అడ్డదారి తొక్కాడు. ఎక్కువ డబ్బు ఇస్తానని ఆశ చూపడంతో గంజాయి స్మగ్లింగ్‌లోకి దిగి కటకటాల పాలయ్యాడు. ఇలా మాస్టర్‌ డిగ్రీ పూర్తి చేసిన వ్యక్తి అత్యాశతో దొంగ మార్గాన్ని ఎంచుకున్ని ఇప్పుడు ఓ నేరస్థుడిగా మిగిలిపోయాడు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా