Health Tips : కాల్షియం సమస్యతో బాధపడేవారికి ఇది బెస్ట్ ఫుడ్.. ఎముకల బలానికి ఇవి ఎంతో ముఖ్యం..
కండరాలు, హార్మోన్ల రిలీజ్, సంకోచ వ్యాకోచాలకు కూడా కాల్షియం అవసరం అతిముఖ్యం. కాల్షియం లోపిస్తే పిల్లలు, పెద్దల్లోనూ అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా..
Calcium rich food: కాల్షియం సమస్యతో బాధపడేవారికి ఇది బెస్ట్ ఫుడ్.. ఎముకల బలానికి ఇవి ఎంతో ముఖ్యం.. మన శరీరానికి కావాల్సిన అతి ముఖ్యమైన పోషకాల్లో కాల్షియం ఒకటి. ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లలకు ఇది ఎంతో అవసరం. ఇది మెదడుకు నరాల ద్వారా సందేశాలను పంపించడంలో కీలక పాత్రపోషిస్తుంది. కండరాలు, హార్మోన్ల రిలీజ్, సంకోచ వ్యాకోచాలకు కూడా కాల్షియం అవసరం అతిముఖ్యం. కాల్షియం అస్థిపంజర పనితీరుకు అవసరం. అవసరమైన మేరకు కాల్షియం ఉన్నప్పుడు అస్థిపంజరం పనితీరు మెరుగ్గా ఉంటుంది. కానీ, ప్రస్తుతం చాలా మంది కాల్షియం లోపంతో బాధపడుతున్నారు. కాల్షియం లోపాన్ని హైపోకాల్షిమియ అని వైద్య పరిభాషలో అంటారు. దీనికి తగిన సమయంలో వైద్యం చేయించుకోకపోతే ప్రమాదకరమైన ఎముకలు సన్నబడే రోగం బారిన పడాల్సి వస్తుంది. అంతేకాదు పిల్లల్లో కాల్షియం లోపిస్తే ఎముకలు బలహీనంగా మారుతాయి. బోలు ఎముకల వ్యాధి బారిన కూడా పడే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే కొన్ని రకాల ఆహారాలను తీసుకుంటే కాల్షియం లోపం నుంచి బయటపడొచ్చు అంటున్నారు వైద్యులు. నిపుణుల సూచన మేరకు..
బాదంపప్పు : కాల్షియం పుష్కలంగా లభించే ఆహార పదార్థాల్లో ముఖ్యంగా బాదంపప్పు ఒకటి..ఇది పిల్లల్లో కాల్షియం లోపానికి చెక్ పెట్టడానికి సూపర్‌గా పని చేస్తుంది. బాదం పప్పులో కాల్షియంతో పాటు మరెన్నో ఆరోగ్యకరమైన పోషకాలు నిండి ఉంటాయి. వీటిని నీటిలో రాత్రంతా కూడా నానబెట్టి ఉదయాన్నే తినటం పిల్లలకు పెద్దలకు ఎంతో మంచిది. ఇలా రోజుకు నాలుగు బాదం పప్పులను తీసుకుంటూ ఉంటే, కాల్షియం లోపం నుంచి బయట పడతారు.
రాగులు: రాగులు శరీరానికి శక్తినిచ్చే మంచి పౌష్టికాహారం. నూరు గ్రాముల రాగులను తీసుకుంటే 300mg కాల్షియం లభిస్తుంది. ఇవి ఎముకలను బలోపేతం చేస్తాయి. అలాగే జీవక్రియల పనితీరు మెరుగుపడుతుంది. దీంతో బరువు కూడా తగ్గుతారు.
నువ్వులు: నువ్వులతో శరీరానికి కావలసిన కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ నువ్వులను తీసుకుంటే సుమారు 88mg కాల్షియం శరీరానికి లభిస్తుంది. దీంతో వృద్ధాప్య వయసులో కూడా ఎముకలు, దంతాలు, నరాల బలహీనత వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
పాలు: పాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజూ ఒక గ్లాసు పాలను తీసుకుంటే శరీరానికి కావాల్సిన కాల్షియం లభిస్తుంది. దీంతో ఎముకలు ఆరోగ్యంగా దృఢంగా ఉంటాయి. ఇంకా సోయా మిల్క్, పెరుగు వంటి పదార్థాలలో కూడా కాల్షియం పుష్కలంగా ఉంటుంది.
చేపలు: సాల్మన్ వంటి వివిధ రకాల కొవ్వు చేపలలో అనేక విటమిన్లు, ప్రొటీన్లతో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలకు కావలసిన కాల్షియంను అందించి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
గుడ్డు:ఉడికించిన గుడ్డులో వివిధ రకాల విటమిన్లు, ప్రొటీన్లు లతోపాటు కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. కనుక ప్రతిరోజూ ఒక ఉడకబెట్టిన గుడ్లును తీసుకుంటే శరీరానికి కావలసిన కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి మీ రోజువారీ ఆహార జీవనశైలిలో గుడ్డును చేర్చుకోండి.
జున్ను: ఇంకా జున్నులో కూడా కాల్షియం కంటెంట్ అనేది చాలా సమృద్ధింగా నిండి ఉంటుంది. అందువల్ల, పిల్లలకు వారంలో కనీసం రెండు సార్లు అయినా జున్నును కనుక పెడితే.. వారిలో కాల్షియం లోపం తగ్గి వారు యాక్టివ్‌గా ఇంకా అలాగే హెల్తీగా కూడా మారతారు.
తాటి ముంజలు: తాటి ముంజలలో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలకు కావలసిన పోషకాలను అందించి ఎముకలకు బలాన్ని ఇస్తుంది. దీంతో ఎముకలు దృఢంగా మారుతాయి. అలాగే మోకాళ్ళ నొప్పులు, కీళ్లనొప్పులు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. కాల్షియం లోపించడం వల్ల శరీరంలోని ఇతర భాగాలపై చెడు ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే మీలో కాల్షియం లోపం లక్షణాలు కనిపిస్తే వెంటనే నిర్దారించుకోండి.
(Note: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)