Viral News: భార్య అలకతీర్చడం కోసం ఆఫీసుకు లీవ్ పెట్టిన ఉద్యోగి..! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న లెటర్‌..!!

కానీ, అతడు అప్లై చేసిన లీవ్‌ లెటర్‌ మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆఫీసులో ఇలాంటి సెలవులు కూడా ఇస్తారా బాస్‌ అనుకుంటూ నెటిజన్లు తెగ ట్రోల్‌ చేస్తున్నారు. కాగా, ఈ ఘటన..

Viral News: భార్య అలకతీర్చడం కోసం ఆఫీసుకు లీవ్ పెట్టిన ఉద్యోగి..! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న లెటర్‌..!!
Untitled 1
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 05, 2022 | 2:48 PM

Viral News: అలిగి పుట్టింటికి వెళ్లిన భార్యను బతిమాలి ఇంటికి తెచ్చుకునేందుకు ఓ ప్రభుత్వ ఉద్యోగి లీవ్‌ కోరుతూ పై అధికారులకు లెటర్‌ రాశాడు. అది చూసిన ఉన్నతాధికారులు ఆమోదం తెలిపారు. కానీ, అతడు అప్లై చేసిన లీవ్‌ లెటర్‌ మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆఫీసులో ఇలాంటి సెలవులు కూడా ఇస్తారా బాస్‌ అనుకుంటూ నెటిజన్లు తెగ ట్రోల్‌ చేస్తున్నారు. కాగా, ఈ ఘటన యూపీలోని చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్ నగర్‌కు చెందిన సంషాద్ అహ్మద్ అనే వ్యక్తి ప్రేమ్ నగర్ బ్లాక్ డెవలప్‌మంట్ ఆఫీసులో క్లర్కుగా పని చేస్తున్నాడు. అయితే, ఇటీవల షంషీద్‌ అతడి భార్యతో గొడవ పడ్డాడు. దీంతో భార్య అలిగి పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య వెళ్లిపోవడంతో అతడు చాలా బాధపడ్డాడు. ఎలాగైన తన భార్యను తిరిగి ఇంటికి తెచ్చుకోవాలనుకున్నాడు. ఇందుకోసం తన భార్య పుట్టింటికి వెళ్లి..ఆమెకు నచ్చజెప్పాలని, ఆ తర్వాత పిల్లలతో సహా భార్యను తన ఇంటికి తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. దీని కోసం రెండు రోజులు లీవ్ కావాలని ఉన్నతాధికారులకు లీవ్ లెటర్ రాశాడు.

అధికారులకు అప్లై చేసిన లీవ్‌ లెటర్‌లో అతడు..తన భార్యతో గొడవ పడ్డట్లు, ఆమెను తిరిగి ఇంటికి తెచ్చుకోవాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. ఈ లీవ్ లెటర్‌కు ఉన్నతాధికారులు ఆమోదం తెలిపి, సెలవు మంజూరు చేశారు. కానీ, షంషీద్‌ రాసిన లీవ్‌ లెటర్‌ మాత్రం నెట్టింట్లో చేరి వైరల్‌ అవుతోంది. లెటర్ చదివిన నెటిజన్లు భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి