Garlic Benefits: రోజూ ఉదయాన్నే పరిగడుపున రెండు వెల్లుల్లి రెబ్బలతో ఇలా చేస్తే రోగాలన్నీ హాంఫట్..!

Garlic Benefits: వెల్లుల్లిని ఆయుర్వేదంలో ఔషధంగా పరిగణిస్తారు. ఇందులో విటమిన్లు B1, B6, C తో పాటు.. మాంగనీస్, కాల్షియం, కాపర్, సెలీనియం..

Garlic Benefits: రోజూ ఉదయాన్నే పరిగడుపున రెండు వెల్లుల్లి రెబ్బలతో ఇలా చేస్తే రోగాలన్నీ హాంఫట్..!
Garlic
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 05, 2022 | 3:20 PM

Garlic Benefits: వెల్లుల్లిని ఆయుర్వేదంలో ఔషధంగా పరిగణిస్తారు. ఇందులో విటమిన్లు B1, B6, C తో పాటు.. మాంగనీస్, కాల్షియం, కాపర్, సెలీనియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అలిసిన్ అని పిలువబడే ఒక ప్రత్యేక ఔషధ మూలకాన్ని కలిగి ఉంటుంది. అలాగే, ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ కోణంలో వెల్లుల్లి అనేక విధాలుగా ఆరోగ్య ప్రదాయినిగా పేర్కొంటారు. అయితే, ప్రతిరోజూ ఉదయం పరిగడుపున రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే.. అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అన్ని రకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు. వెల్లుల్లి వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉదర సమస్యలు మాయం.. ఆయుర్వేదం ప్రకారం సగానికిపైగా వ్యాధులకు కారణం మన జీర్ణ వ్యవస్థే. అయితే, ఈ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి ఉదయం వేళ ఖాళీ కడుపుతో రెండు వెల్లుల్లి రెబ్బలను నీటితో కలిపి తీసుకోవాలి. అలా చేస్తే.. గ్యాస్, అసిడిటీ, అజీర్తి, మలబద్ధకం మొదలైన సమస్యన్నీ మాయం అవుతాయి.

రోగనిరోధక వ్యవస్థ బలోపేతం.. వెల్లుల్లి శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో అద్భుతంగా పని చేస్తుంది. దీన్ని రెగ్యూలర్‌గా తీసుకోవడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అన్ని వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఆరోగ్యంగా ఉండేలా కాపాడుతుంది.

ఇవి కూడా చదవండి

బరువు తగ్గడంలోనూ.. బరువు తగ్గడంలోనూ వెల్లుల్లి అద్భుతంగా పని చేస్తుంది. వెల్లుల్లి జీవక్రియను మెరుగుపరచడమే కాకుండా.. శరీరంలోని కొవ్వును వేగంగా కరిగిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి వెల్లుల్లి చాలా ఉపయోగకరమైనది.

షుగర్ లెవల్స్‌ను నియంత్రిస్తుంది.. డయాబెటిక్ పేషెంట్లకు వెల్లుల్లి చాలా ఉపయుక్తమైనది. ఇందులో ఉండే అల్లిసిన్ అనే మూలకం రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. మధుమేహ బాధితులు రోజూ ఉదయాన్నే వెల్లుల్లిని తీసుకుంటే ఆ సమస్య తగ్గుతుంది.

సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం.. క్రమం తప్పకుండా రెండు వెల్లుల్లి రెబ్బలను నీటితో కలిపి తీసుకోవడం వల్ల సీజనల్ వ్యాధుల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. వెల్లుల్లిని రోజూ తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. అలాగే, ఇది TB, ఆస్తమా వంటి రోగులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీబయాటిక్, యాంటీ కార్సినోజెనిక్ గుణాలు పుష్కలంగా ఉండటం వల్ల.. వెల్లుల్లి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అలాగే, అధిక బీపీ సమస్య ఉన్నవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..