AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes: డయాబెటిస్‌ బాధితులకు ఈ పూలు దివ్యౌధం.. మార్పు మీరు తప్పక గ్రహిస్తారు..!

ఆధునిక కాలంలో జీవన శైలిలో చోటు చేసుకున్న మార్పులు, అధిక క్యాలరీలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం, శారీరక వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి డయాబిటిస్ రావడానికి ప్రధాన కారణాలుగా వైద్యులు చెబుతున్నారు.

Diabetes: డయాబెటిస్‌ బాధితులకు ఈ పూలు దివ్యౌధం.. మార్పు మీరు తప్పక గ్రహిస్తారు..!
Diabetes Control
Jyothi Gadda
|

Updated on: Aug 05, 2022 | 3:50 PM

Share

Diabetes: డయాబెటిస్ మెల్లిటస్ అనేది ఒక జీవక్రియ వ్యాధి. ఇది దీర్ఘకాలిక రక్తంలో చక్కెర స్థాయిలను కలిగి ఉంటుంది. శరీరంలోని వివిధ అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పెరిగిన చక్కెర స్థాయిలు ఇన్సులిన్ ఉత్పత్తి, శోషణ సమస్యలతో ముడిపడి ఉంటాయి. ఆధునిక కాలంలో జీవన శైలిలో చోటు చేసుకున్న మార్పులు, అధిక క్యాలరీలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం, శారీరక వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి డయాబిటిస్ రావడానికి ప్రధాన కారణాలుగా వైద్యులు చెబుతున్నారు. అయితే, డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులు కొన్ని ఆహార నియమాలు పాటిస్తే..తప్పక ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వాటిల్లో అరటి పువ్వు ఒకటి. మధుమేహం వ్యాధిగ్రస్తులు అరటి పువ్వు ఆహారంలో చేర్చు్కోవటం ద్వారా ప్రభావం తప్పక తెలుసుకుంటారని చెబుతున్నారు.

అరటి పువ్వు: డయాబెటిస్‌పై అరటి పువ్వు ప్రభావాన్ని గుర్తించడానికి గత దశాబ్దంలో అనేక అధ్యయనాలు, జంతు పరీక్షలు జరిగాయి. జర్నల్ ఆఫ్ ది సైన్స్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్‌లో ప్రచురించబడిన ఒక పీర్-రివ్యూ స్టడీ థా చూపించింది. అరటి పువ్వులో డయాబెటిక్ వ్యతిరేక లక్షణాలు ఉన్నాయని, మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారంలో అరటి పువ్వుఉ చేర్చడం వల్ల పాలియురియా, హైపర్గ్లైసీమియా, శరీర బరువు హెచ్చుతగ్గులు వంటి ఇతర మధుమేహ లక్షణాలను కూడా తగ్గిస్తుందని కనుగొన్నారు. అధ్యయనం ప్రకారం..అరటి పువ్వులో కేలరీలు తక్కువగా ఉంటాయి, కానీ ఫైబర్ అధికంగా ఉంటుంది.ఇందులో ఉండే కరిగే ఫైబర్ శరీరంలోని కొలెస్ట్రాల్ , రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే కరగని ఫైబర్ మలబద్ధకం,ఇతర జీర్ణ సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. అరటి పువ్వు అరటి పువ్వు తినడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. నిజానికి అరటి పువ్వులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.

స‌దాబ‌హార్ పువ్వులు: అలాగే, స‌దాబ‌హార్ పువ్వులు (సతత హరిత)  సైతం మధుమేహం వ్యాధిగ్రస్తులకు మేలుచేస్తాయంటున్నారు నిపుణులు. ఉద‌యం అల్పాహారం చేసిన వెంట‌నే వీటిని తినాలని సూచిస్తున్నారు.  5 నుంచి 6 స‌దాబ‌హార్ పువ్వుల‌ను అలాగే తిన‌వ‌చ్చు. పింక్ కలర్, తెలుపు ఏ ర‌కం పువ్వులు అయినా స‌రే ప‌నిచేస్తాయి. వాటిని తిన్న వెంట‌నే నీటిని తాగాలి. ఎందుకంటే ఇవి చాలా చేదుగా ఉంటాయి.  సతత హరిత పువ్వులో ఆల్కలాయిడ్స్‌ ఉంటాయి. ఇవి ఇన్సులిన్‌ తయారీలో సహాయపడతాయి. ఇన్సులిన్‌ ఉత్పత్తి కావడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచదు. అందువల్ల, మీరు డయాబెటిక్‌ పేషంట్‌ అయితే, ఎవర్‌ గ్రీన్‌ పువ్వులు తినండి. ఎవర్‌ గ్రీన్‌ ఫ్లవర్‌ డయాబెటిక్‌ పేషెంట్లకు మాత్రమే కాదు, అనేక వ్యాధులకు కూడా ఉపయోగపడుతుంది. దీని వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మేలు జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

(Note: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)