Black Salt Water: రోజూ నల్ల ఉప్పు నీరు తాగితే ఆ సమస్యలే దరిచేరవు.. ఇంకా బోలెడన్ని లాభాలు..

నల్ల ఉప్పు ప్రత్యేకమైన రుచి, వాసన కలిగి ఉండి ఆహారపదార్థాలకు మరింత రుచిని అందిస్తుంది. సాధారణ ఉప్పుతో పోలిస్తే ఈ ఉప్పులో సోడియం శాతం (sodium) తక్కువగా ఉంటుంది.

Black Salt Water: రోజూ నల్ల ఉప్పు నీరు తాగితే ఆ సమస్యలే దరిచేరవు.. ఇంకా బోలెడన్ని లాభాలు..
Black Salt Water
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 05, 2022 | 4:10 PM

Black Salt Water Benefits: తెల్ల ఉప్పు కంటే.. నల్ల ఉప్పు ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుందన్న విషయం మనందరికీ తెలుసు. నల్ల ఉప్పును పలు రకాలుగా పిలుస్తారు. ఈ నల్ల ఉప్పు ప్రత్యేకమైన రుచి, వాసన కలిగి ఉండి ఆహారపదార్థాలకు మరింత రుచిని అందిస్తుంది. సాధారణ ఉప్పుతో పోలిస్తే ఈ ఉప్పులో సోడియం శాతం (sodium) తక్కువగా ఉంటుంది. నల్ల ఉప్పును రైతా, సలాడ్, డ్రింక్స్, ఫ్రూట్ సలాడ్ వంటి వాటిలో బ్లాక్ సాల్ట్ ను ఉపయోగిస్తారు. బ్లాక్ సాల్ట్‌ రుచిని సైతం పెంచుతుంది.

నల్ల ఉప్పు నీరు ఎందుకు తాగాలంటే..?

ఆరోగ్యానికి మేలు చేసే నల్ల ఉప్పులో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. రోజూ నల్ల ఉప్పు నీటిని తాగితే అది శరీరానికి ప్రయోజనకరంగా ఉంటుంది. బ్లాక్‌ సాల్ట్‌ నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకోండి..

ఇవి కూడా చదవండి

నల్ల ఉప్పు నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

మధుమేహం నుంచి ఉపశమనం కల్పిస్తుందిః తెల్ల ఉప్పులో సోడియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మధుమేహ రోగులు చక్కెర, ఉప్పు తీసుకోవడం నియంత్రణలో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. డయాబెటిక్ పేషెంట్స్ బ్లాక్ సాల్ట్ వాటర్ తీసుకుంటే మంచిదని పేర్కొంటున్నారు.

జీర్ణక్రియలో సహాయపడుతుందిః ప్రతిరోజూ ఉదయం నల్ల ఉప్పు నీటిని తాగితే, మీ జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడుతుంది. ఎందుకంటే ఇది కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్, ప్రోటీన్‌లను జీర్ణం చేసే ఎంజైమ్‌లను సక్రియం చేస్తుంది. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు ఉండవు.

జుట్టుకు మంచిదిః బ్లాక్ సాల్ట్ ఎక్స్‌ఫోలియేటింగ్, క్లెన్సింగ్ గుణాలను కలిగి ఉంటుంది. ఇది జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది స్కాల్ప్, జుట్టును క్లియర్ చేస్తుంది. దీని కారణంగా జుట్టు అందం పెరుగుతుంది.

బరువు తగ్గుతుందిః ఊబకాయం అనేక వ్యాధులకు దారితీస్తుంది. ప్రస్తుతం చాలామంది పెరుగుతున్న బరువుతో ఇబ్బంది పడుతున్నారు. నల్ల ఉప్పు నీటిలో యాంటీ ఒబెసిటీ లక్షణాలు ఉన్నాయి. దీని కారణంగా పెరుగుతున్న బరువు వేగంగా తగ్గడం ప్రారంభమవుతుంది.

(Note: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి