Health Tips: పంటి నొప్పితో బాధపడుతున్నారా? అయితే, ఈ చిట్కాలతో ఉపశమనం పొందండి..

Health Tips: పంటి నొప్పి వలన కలిగే బాధ వర్ణణాతీతం. భరించలేని స్థాయిలో ఉంటుంది. రాత్రి నిద్రిస్తున్నప్పుడు పంటి నొప్పి వస్తే..

Health Tips: పంటి నొప్పితో బాధపడుతున్నారా? అయితే, ఈ చిట్కాలతో ఉపశమనం పొందండి..
Toothache
Follow us

|

Updated on: Aug 05, 2022 | 9:07 PM

Health Tips: పంటి నొప్పి వలన కలిగే బాధ వర్ణణాతీతం. భరించలేని స్థాయిలో ఉంటుంది. రాత్రి నిద్రిస్తున్నప్పుడు పంటి నొప్పి వస్తే.. నరకం చూపిస్తుంది. ఏం చేయలేని పరిస్థితిలో నిద్ర కూడా పట్టదు. పంటి నొప్పి కారణంగా కొన్నిసార్లు నోటివాపు, తీవ్రమైన తలనొప్పి వస్తుంది. అయితే, పంటి నొప్పికి అనేక కారణాలు ఉన్నాయి. దంతాలు శుభ్రంగా తోమకపోవడం, కాల్షియం లోపం, వేడి, చల్లని పదార్థాలు తినడం, బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్స్ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఎవరికైనా అకస్మాత్తుగా పంటి నొప్పి వస్తే కొన్ని నివారణ చర్యలు పాటించడం ద్వారా ఉపశమనం పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

లవంగం.. పంటి నొప్పి నివారణలో లవంగం చాలా ప్రభావంతంగా పని చేస్తుంది. లవంగాలలో యూజినాల్ ఉంటుంది. ఇది వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో యాంటీమైక్రోబయల్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవి బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి. పంటి నొప్పి సమయంలో లవంగాలను మెత్తగా చేసి నొప్పి ఉన్న ప్రదేశంలో పెట్టాలి. లేదా లవంగాలను చప్పరించవచ్చు. లవంగాలను నీటిలో వేసి మరిగించాలి. ఆ నీరు కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు.. ఆ నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల మంచి ఫలితం ఉంటుంది.

వెల్లుల్లి.. వెల్లుల్లి కూడా పంటి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే అల్లిసిన్ సమ్మేళనం ఉంటుంది. పంటి నొప్పి వచ్చినప్పుడు.. వెల్లుల్లి రెబ్బను నొప్పి ఉన్న స్థానంలో పెట్టుకోవాలి. దీనివలన కాసేపట్లో ఆ నొప్పి ఉపశమనం లభిస్తుంది.

కోల్డ్ కంప్రెస్.. పంటి నొప్పితో నోరు వాపు వచ్చినప్పుడు ఐస్ క్యూబ్‌తో కోల్డ్ కంప్రెస్ చేయాలి. మందపాటి టవల్‌లో ఐస్ క్యూబ్స్ వేసి.. మసాజ్ మాదిగా చేయాలి. ఇలా చేయడం వలన వాపు తగ్గుతుంది. పంటి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

పసుపు.. పసుపును యాంటీబయాటిక్‌గా కూడా పరిగణిస్తారు. ఒక పాత్రలో కొద్దిగా పసుపు, రాళ్ల ఉప్పు, ఆవాల నూనె వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని పంటి నొప్పి ఉన్న ప్రదేశంలో రాయాలి. ఫాస్ట్ రిలీఫ్ వస్తుంది. రోజూ పడుకునే ముందు దీన్ని క్రమం తప్పకుండా అప్లై చేయడం ద్వారా ఫలితం ఉంటుంది.

వీటితో పాటు మరికొన్ని చిట్కాలు కూడా ఉన్నాయి. నిమ్మరసంలో కొద్దిగా ఉసిరికాయ కలిపి దూదితో దంతాలపై రాయాలి. ఇలా చేయడం ద్వారా పంటి నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. పూదీనా కూడా ఈ సమస్య నుంచి దూరం చేస్తుంది. పూదీనాలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది పంటి నొప్పి ఉన్న చోట పెడితే.. ఆ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..