Health Tips: పాలలోనే కాదు.. ఈ డ్రింక్స్ లోనూ కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది..!

Health Tips: ప్రస్తుత ఉరుకులు, పరుగుల జీవితంలో సంపాదనపైనే అందరు ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో తమ ఆరోగ్యంపై అశ్రద్ధ వహిస్తున్నారు.

Health Tips: పాలలోనే కాదు.. ఈ డ్రింక్స్ లోనూ కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది..!
Milk
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 05, 2022 | 9:09 PM

Health Tips: ప్రస్తుత ఉరుకులు, పరుగుల జీవితంలో సంపాదనపైనే అందరు ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో తమ ఆరోగ్యంపై అశ్రద్ధ వహిస్తున్నారు. శరీరంలో కాల్షియం లోపిస్తే బాడీ పెయిన్, కీళ్ల నొప్పులు సహా ఇతర సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా శరీరంలో కాల్షియం, విటమిన్ డి వంటి ముఖ్యమైన పోషకాల లోపం ఏర్పడుతుంది. నిపుణుల ప్రకారం.. శరీరంలో కాల్షియం లోపం ఉంటే ఆర్థరైటిస్, బోలు ఎముకల వ్యాధి, కండరాల తిమ్మిరి, బలహీనమైన గోర్లు, పీరియడ్స్ సమయంలో విపరీతమైన నొప్పి, తలనొప్పి, డిప్రెషన్, గుండె కొట్టుకోవడం సక్రమంగా లేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. కాల్షియం, విటమిన్ డి ఉండే పదార్థాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. అలాంటి పదార్థాలలో పాలు ముఖ్యమైనది. పాలు తాగితే ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చంటారు. అయితే, కొంతమందికి పాలు ఏమాత్రం ఇష్టం ఉండదు. అలాంటి వారి కోసమే.. ఈ న్యూస్. పాలలో ఉండే పోషకాలే.. మరికొన్ని డ్రింక్స్‌లోనూ ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కొబ్బరి పాలు.. కొబ్బరిని ఆరోగ్య ప్రయోజనాల స్టోర్‌హౌస్‌గా పరిగణిస్తారు. మార్కెట్‌లో సులభంగా లభించే కొబ్బరి పాలతో కూర కూడా వండుతారు. కూరగాయల సూప్, చియా గింజలు, ఇతర పదార్థాలలో కలిపి తీసుకోవచ్చు. మీ పిల్లలు పాలు తాగడం మానేస్తే.. కొబ్బరి పాలు తాగించొచ్చు. ఈ కొబ్బరి పాలతో ఐస్ క్రీమ్ తయారు చేసి పిల్లలకు తినిపించొచ్చు.

జీడిపప్పు పాలు.. ఆవు, గేదె పాలు తాగడం ఇష్టం లేకపోతే.. దాని ప్లేస్‌లో జీడిపప్పుతో తయారు చేసిన పాలు తాగొచ్చు. అయితే, ఇది వేసవి కాలంలో ఎక్కువగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాకాకుండా ఉండాలంటే. జీడిపప్పును రాత్రంతా నానబెట్టి.. ఉదయం పేస్ట్ చేసిన తరువాత పాలలో ఉడకబెట్టాలి. చక్కెరకు బదులుగా తేనె, బెల్లం కలుపుకోవచ్చు. ఇవి తాగడానికి చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు వీటిని ఎంతో ఇష్టంగా తాగుతారు.

ఇవి కూడా చదవండి

బాదం పాలు.. బాదం పాలతో డబులు బెనిఫిట్స్ ఉంటాయి. సీజన్ ఏదయినా బాదం పప్పుును నానబెట్టిన తరువాతే తినాలి. నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో బాదం పాలు తాగడం వల్ల అక్కడి ప్రజలు చాలా ఆరోగ్యంగా ఉంటారు. బాదం పాలలో తేనె లేదా బెల్లం కలుపుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగలి. ఈ పాలు శరీరంలో విటమిన్ డి, కాల్షియం కొరతను తగ్గిస్తుంది.

(గమనిక: ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని, ఆయుర్వేద నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ పబ్లిస్ చేయడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే.. వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..