AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical Illusion: మీ కళ్లకు పరీక్ష.. ఇందులో నిజమైన గుడ్లగూబ ఏదో కనిపెట్టండి చూద్దాం.. ఐదు సెకన్లే టైం..

ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని చూడండి. ఈ చిత్రంలో ఎన్నో గుడ్లగూబల బొమ్మలు ఉన్నాయి. అయితే.. దీనిలో ఓ గుడ్లగూబ కూడా దాగుంది.

Optical Illusion: మీ కళ్లకు పరీక్ష.. ఇందులో నిజమైన గుడ్లగూబ ఏదో కనిపెట్టండి చూద్దాం.. ఐదు సెకన్లే టైం..
Optical Illusion
Shaik Madar Saheb
| Edited By: Ravi Kiran|

Updated on: Aug 06, 2022 | 4:18 PM

Share

Optical Illusion Test: సోషల్ మీడియా ఎన్నో వింతలు, విశేశాలను మన ముందుకు తీసుకువస్తుంది. ఎల్లప్పుడూ వైరల్ వీడియోలు, ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటుంటాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలు కూడా చాలానే ఉంటాయి. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలు మన మెదడును మోసగించడంలో ముందుంటాయి. వీటిలో ఎన్నో విషయాలు దాగుంటాయి. ఇవి మన మెదడు కణాలకు కూడా మంచి వ్యాయామం. కంటి చూపును మెరుగుపర్చేందుకు కూడా సహాయపడతాయి. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని చూడండి. ఈ చిత్రంలో ఎన్నో గుడ్లగూబల బొమ్మలు ఉన్నాయి. అయితే.. దీనిలో ఓ గుడ్లగూబ కూడా దాగుంది. బొమ్మలతో నిండిపోయిన ఈ చిత్రంలో అసలైన గుడ్లగూబను కనిపెట్టడం సవాలుగా మారింది. దీనిలో మరో ట్విస్ట్ ఏంటంటే. ఈ గుడ్లగూబను 5 సెకన్లలో కనిపెడితే.. మీ మెదడు సూపర్ అంటూ సవాల్ విసురుతున్నారు నెటిజన్లు. మీరు కూడా 5 సెకన్లలో నిజమైన గుడ్లగూబను గుర్తిస్తే మీ మైండ్ షార్ప్ గా ఉన్నట్లే.. ఇంకెందుకు ఆలస్యం ట్రై చేయండి..

నిజమైన గుడ్లగూబను 5 సెకన్లలో కనుక్కుంటే జీనియస్.. 

Optical Illusion

Optical Illusion

ఈ చిత్రంలో రాక్‌లో అమర్చిన వివిధ రకాల రంగురంగుల గుడ్లగూబ బొమ్మలను మనం చూడవచ్చు. మీ కళ్ళు ఎంత షార్ప్ గా ఉన్నాయో దీన్ని చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ గుడ్లగూబల మధ్య నిజమైన గుడ్లగూబ కూడా కూర్చుని ఉంది. సాధ్యమైనంత తక్కువ సమయంలో నిజమైన గుడ్లగూబను కనుగొనడం సవాలే.. గుడ్లగూబను కేవలం 5 సెకన్లలో గుర్తించాలి. గుర్తుంచుకోండి..

ఇవి కూడా చదవండి

కనుగొన్నరా..? లేకపోతే.. ఈ చిత్రాన్ని మళ్లీ చూడండి.. దీనిని క్షుణ్ణంగా పరిశీలిస్తే పక్షిని గుర్తించవచ్చు. మీలో కొందరు ఇప్పటికే గుడ్లగూబను చూశారని మేము ఆశిస్తున్నాము. అలాంటి వారికి చురుకైన చూపు, మంచి తెలివితేటలు ఉన్నాయని అర్థమవుతుంది.

Optical Illusion

Optical Illusion

ఎంత ప్రయత్నించిన నిజమైన గుడ్లగూబ కనిపించలేదా..? అయితే నిరుత్సాహపడకండి. కింద ఇచ్చిన ఫొటోను ఒకసారి చూడండి.. ఈ గుడ్లగూబ చిత్రాన్ని వెస్ట్ లోథియన్‌లోని స్కాటిష్ ఔల్ సెంటర్‌లో క్లిక్ చేశారు. ఇది ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

Owel

Owel

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..