ఆ తొమ్మిది జిల్లాలకు రెయిన్ అలర్ట్.. స్కూల్స్‌కి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం..
నైరుతి రుతుపవనాల ప్రభావంతో తమిళనాడు, ముఖ్యంగా పశ్చిమ కనుమల పరిసర ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి .
నైరుతి రుతుపవనాల ప్రభావంతో తమిళనాడు, ముఖ్యంగా పశ్చిమ కనుమల పరిసర ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి . తమిళనాడులోని కోయంబత్తూర్, తేని, దిండిగల్, ఈరోడ్, ధర్మపురి, సేలం, కళ్లకురిచ్చి, పెరంబలూర్ మరియు నమక్కల్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం (ఆర్‌ఎంసి) శుక్రవారం తెలిపింది. ఇప్పటికే నీలగిరి జిల్లాలో గత 24 గంటల్లో గరిష్టంగా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కోయంబత్తూరు జిల్లాలో 19 సెం.మీ, దేవాల నీలగిరి జిల్లాలో 18 సెం.మీ వర్షపాతం నమోదైంది. నీలగిరి జిల్లా యంత్రాంగం వరుసగా మూడో రోజు శుక్రవారం కూడా పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించింది. కోయంబత్తూరు కలెక్టర్ సమీరన్ కూడా వాల్పరై తాలూకా చుట్టుపక్కల పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా తలెత్తిన పరిస్థితిని సమీక్షించారు. నిర్వాసితులకు ముందస్తు సమాచారం లేకుండా డ్యామ్‌ల నుండి నీటిని విడుదల చేయవద్దని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. పరిపాలన అధికారులు రాత్రిపూట రిజర్వాయర్ల నుండి భారీ మొత్తంలో నీటిని విడుదల చేయరాదని చెప్పారు. మెట్టూరు జలాశయం నుంచి 2 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం వల్ల కావేరి, కొల్లిడాం గట్టుపై ఉన్న జిల్లాలు ప్రభావితమయ్యే అవకాశం ఉన్నందున, తగు చర్యలు తీసుకోవాలని పర్యవేక్షణ అధికారులను ముఖ్యమంత్రి కోరారు. ఎర్త్‌మూవర్‌లు, చెట్లను కత్తిరించే యంత్రాలు, మల్టీ డిపార్ట్‌మెంటల్ టీమ్‌లు, రెస్క్యూ టీమ్‌లను సిద్ధంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇప్పటికే కావేరి నది పరవళ్లు తొక్కుతోంది. తిరుచిరాపల్లిలో నది ఉధృతికి శ్రీరంగం ఆలయం నీట మునిగింది. కుట్రాళం జలపాతం మహోధృతంగా దూకుతోంది. వాగులు వంకలు వంతెనల పైనుంచి ప్రవహిస్తున్నాయి. అలాంటిచోట్ల ప్రయాణాలు ప్రమాదకరంగా మారాయి.
వైగై జలాశయం నుంచి భారీగా నీటిని దిగువకు విడుదల చేయడంతో పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలు నీట మునిగాయి. సేలంలోని మెట్టూరు డ్యాంకు భారీగా వరద వస్తోంది. తమిళనాడులో డ్యామ్‌లు నిండుకుండల్లా ఉన్నాయి. మెట్టూరు డ్యాం పూర్తిగా నిండిపోయింది.దిండిగల్ జలపాతం దగ్గర ఫొటో దిగుతూ ఓ యువకుడు కాలు జారి వందల అడుగుల లోతులో పడిపోయాడు.
కేరళలో కూడా కుండపోత వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వేర్వేరు ఘటనల్లో 18 మంది మృతి చెందారు. 9 జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. మరో మూడు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. 2018 నాటి వరదల పరిస్థితి రిపీట్ అవుతుతుందేమోనని అందరూ ఆందోళన చెందారు. అయితే ఇవాళ వర్షాలు కాస్త శాంతించడంతో ముప్పు తప్పింది. నదులు పరవళ్లు తొక్కుతున్నాయి.