Viral Video: వీధుల్లో రైనా వీర విహరం.. రద్దీగా ఉన్న రోడ్లపై దర్జాగా తిరుగుతున్న ఖడ్గమృగం.. ఎక్కడో తెలిస్తే షాకే!
ఖడ్గమృగం ఉరుకులు పరుగులు పెడుతోంది. దాన్ని చూసి చుట్టుపక్కల జనాలు భయంతో పరుగులు పెడుతున్నారు. ఈ వీడియోను ఇప్పటికే కొన్ని వేల మంది చూశారు. రీ ట్విట్లు కూడా భారీగా వచ్చాయి.
Viral Video: వన్యప్రాణులు జనావాసాల్లోకి రావడం మామూలే. అడవి జంతువుల దాడిలో చాలా మంది గాయపడుతుంటారు. అలాంటి వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారి సుశాంత నందా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రద్దీగా ఉండే పట్టణంలో ఓ ఖడ్గమృగం దర్జాగా నడుస్తున్న వీడియో అది. అయితే, ఈ వీడియోకి ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా జోడించారు. ఖడ్గమృగం మనుషుల ఆవాసాలలోకి వచ్చి సంచరించినప్పుడు, దానిపట్ల ఎవరూ భయం, గందరగోళానికి గురికావొద్దని అనే నోట్‌తో వీడియోను షేర్ చేశారు. కానీ, నగరంలో ఖడ్గమృగం ఎవరిపైనా దాడి చేసినట్లు సమాచారం లేదు. రద్దీగా ఉండే నగరంలో ఒక ఖడ్గమృగం పారిపోతున్నట్టుగా వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియోను ఇప్పటికే కొన్ని మంది చూశారు. రీ ట్విట్లు కూడా భారీగా వచ్చాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
IFS అధికారి సుశాంత నందా ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేసిన ఈ వీడియోలో జనంతో నిండిన పట్టణంలో ఒక ఖడ్గమృగం నడుస్తున్నట్లు చూపిస్తుంది. ఐఎఫ్‌ఎస్ అధికారి సుశాంత నందా ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేసిన ఈ వీడియోలో జనంతో నిండిన పట్టణంలో ఖడ్గమృగం ఉరుకులు పరుగులు పెడుతోంది. దాన్ని చూసి చుట్టుపక్కల జనాలు భయంతో పరుగులు పెడుతున్నారు. దాని వెనకాల ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఆ జంతువును వింతగా చూస్తున్నారు. రైనో రోడ్లపై పరిగెడుతుంటే.. వీధి కుక్కలు సైతం పరుగులు తీస్తున్నాయి.
When the human settlement strays into a rhino habitat… Don’t confuse with Rhino straying in to a town pic.twitter.com/R6cy3TlGv1
— Susanta Nanda IFS (@susantananda3) August 5, 2022
కానీ, ఆ ఖడ్గమృగం ఎవరికీ ఎలాంటి హానీ చేయలేదు. దాని దారిన అది పరిగెడుతూ పోతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోని అప్‌లోడ్ చేసినప్పటి నుండి 7.5K పైగా వ్యూస్‌ని సంపాదించింది. నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి