Viral News: కొత్త పెళ్లికొడుక్కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఫ్రెండ్స్.. ఓపెన్ చేసిన వరుడికి మైండ్ బ్లాంక్..
తాజాగా కోనసీమ అంబేద్కర్ జిల్లాలో ఓ యువకుడికి అతని ఫ్రెండ్స్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. అది చూసిన వరుడికి మైండ్ బ్లాంక్ అయ్యింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
జీవితంలో పెళ్లి ఓ ప్రత్యేకమైన వేడుక. (Viral) ఎంతో సందడిగా.. సరదాగా బంధుమిత్రుల సమక్షంలో జరగాలని కోరుకుంటారు. స్నేహితులను.. ఇరుగుపొరుగు వారిని తమ వివాహనికి, ఎంగెజ్మెంట్ కు రావాలని ఆహ్వానిస్తుంటారు. పెళ్లికి వెళ్లి ప్రతి ఒక్కరు నూతన వధూవరుల కోసం కొన్ని అందమైన కానుకలను తీసుకెళ్తుంటారు. బహుమతులు ఇచ్చి జీవితాంతం సంతోషంగా ఉండాలని ఆశీర్వదిస్తుంటారు. అయితే ఇటీవల వివాహ వేడుకల్లో రకరకాల గిఫ్ట్‌లు ఇస్తూ వధూవరులతో పాటు నెటిజన్లనూ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా కోనసీమ అంబేద్కర్ జిల్లాలో ఓ యువకుడికి అతని ఫ్రెండ్స్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. అది చూసిన వరుడికి మైండ్ బ్లాంక్ అయ్యింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అంబెడ్కర్ కోనసీమ జిల్లాలో అల్లవరం మండలం బోడసకుర్రు గ్రామానికి చెందిన రంకిరెడ్డి ప్రసాద్ కు .. చెయ్యేరు గ్రామానికి చెందిన ఏరుబండి రమ్య తో పెళ్ళి కుదిరింది. వారిద్దరికీ ఎంగేజ్ మెంట్ జరుగుతున్న తరుణంలో పెళ్లికొడుకు ఫ్రెండ్స్ కాబోయే వధూవరులకు మైండ్ బ్లాక్ అయే గిఫ్ట్ ఇచ్చారు. అది చూసిన జనం తెగ నవ్వుకున్నారు. సెల్ ఫోన్స్ విస్తరించక ముందు కాయిన్ బాక్స్ ఫోన్స్ ఉండే గుర్తుందా ?. అప్పట్లో షాపు దగ్గర.. లేదా ఒకరి ఇంటి ముందు ఇలాంటి కాయిన్ బాక్స్ ఫోన్స్ ఉండేవి. రూపాయి కాన్స్ వేసి కాల్స్ మాట్లాడుకోవడానికి వెసులుబాటు ఉండేది. అయితే మొబైల్స్ వచ్చాక ఈ కాయిన్ బాక్స్ ఫోన్స్ ఉపయోగించడం తగ్గిపోయింది. దీంతో ఇవి కనుమరుగయ్యాయి.
తాజాగా అంతరించిపోయిన ఈ కాయిన్ బాక్స్ ఫోన్ గిఫ్ట్ గా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపోయేలా చేసారు..సెల్ ఫోన్లు రాకముందు ఈ కాయిన్ బాక్స్ ల వద్దకే వెళ్ళి మాట్లాడుకునేవారని, వాటిని గుర్తు చేయడాకే ఇలా ఈ గిఫ్ట్ ఇచ్చాము అంటున్నారు పెళ్ళి కొడుకు ప్రసాద్ ఫ్రెండ్స్.. వాళ్ళ కాన్సెప్ట్ ఏదైనా కాయిన్ బాక్స్ చూసి పగలబడి నవ్వుకున్నారు ఎంగేజ్ మెంట్ కు వచ్చిన బంధుమిత్రులు…కాగా ఈ వీడియో ఇంటర్నెట్‌లో ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.