Liger Movie: సెన్సార్ కంప్లీట్ చేసుకున్న లైగర్.. విజయ్ సినిమా రన్ టైమ్ ఏంతంటే..

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ సెన్సార్ వర్క్ కంప్లీట్ చేసుకుంది.

Liger Movie: సెన్సార్ కంప్లీట్ చేసుకున్న లైగర్.. విజయ్ సినిమా రన్ టైమ్ ఏంతంటే..
Liger
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 05, 2022 | 4:39 PM

Vijay Deverakonda: మోస్ట్ అవైయిటెడ్ ఫిల్మ్ లైగర్ (Liger). ఈ సినిమా కోసం సౌత్ టూ నార్త్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. పోస్టర్స్, టీజర్‏తో సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్, సాంగ్స్ యూట్యూబ్‏లో మిలియన్స్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా ట్రైలర్‏తోనే సినిమా పై హైప్ క్రియేట్ చేశారు. మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ మూవీలో విజయ్ (Vijay Devarakonda) సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటిస్తుండగా.. రౌడీ హీరో మథర్ పాత్రలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కనిపించనుంది (Ananya Panday). ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ సెన్సార్ వర్క్ కంప్లీట్ చేసుకుంది.

సెన్సార్ బోర్డ్ ప్రకారం లైగర్ చిత్రం దాదాపు 2 గంటల 20 నిమిషాల రన్ టైమ్ ఉన్నట్లు తెలుస్తోంది. యాక్షన్ సీక్వెన్స్, పాటలతోపాటు.. మూవీలో మరిన్ని సన్నివేశాలు ఆకట్టుకునే సన్నివేశాలు ఉన్నాయి. బాక్సర్ పాత్రలో విజయ్ నటన అదిరిపోయిందని.. ఇక అనన్య, రమ్యకృష్ణ తమ పాత్రలో జీవించేసినట్లు తెలుస్తోంది. సాంగ్స్ అండ్ యాక్షన్ సీన్స్ బాగున్నాయని.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకోనుంది. ఈ సినిమాతో విజయ్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటికే నార్త్ లో విజయ్ రౌడీ హీరో క్రేజ్ ఎక్కువగానే పెరిగిపోయింది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో ఆగస్ట్ 25న విడుదల చేయనున్న సంగతి తెలిసిందే.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.