Naga Chaitanya: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్‏తో చైతూ మరో సినిమా ?.. ఆసక్తికరంగా మారిన మీటింగ్..

బీటౌన్ స్టార్ డైరెక్టర్ సంజాయ్ లీలా భన్సాలీ కార్యాలయంలో చైతూ కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. లాల్ సింగ్ చద్దా సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న అనంతరం..

Naga Chaitanya: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్‏తో చైతూ మరో సినిమా ?.. ఆసక్తికరంగా మారిన మీటింగ్..
Nagachaitanya
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 05, 2022 | 3:53 PM

ఇటీవలే థాంక్యూ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya). రాశి ఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా ఆశించినంత స్థాయిలో ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు లాల్ సింగ్ చద్దా సినిమాతో థియేటర్లలో సందడి చేయనున్నారు. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటించిన ఈ సినిమాలో చైతూ.. సౌత్ అబ్బాయి బాలరాజు పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, బాలరాజు ఇంట్రడ్యూసింగ్ వీడియో ఆకట్టుకున్నాయి. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ ఆగస్ట్ 11న విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రస్తుతం చైతూ ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. ఇక లాల్ సింగ్ చద్దా మాత్రమే కాకుండా.. బాలీవుడ్ ఇండస్ట్రీలో చైతూ మరిన్ని చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

బీటౌన్ స్టార్ డైరెక్టర్ సంజాయ్ లీలా భన్సాలీ కార్యాలయంలో చైతూ కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. లాల్ సింగ్ చద్దా సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న అనంతరం.. చైతూ ముంబైలోని సంజాయ్ లీలా భన్సాలీని కలిసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట హాల్చల్ చేస్తున్నాయి. దీంతో వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతుందంటూ ఫిల్మ్ సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి. చైతూ.. సంజయ్ లీలా కలిసి మరో దేవదాస్ సినిమా చేయమని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. గతంలో చైతూ గ్రాండ్ ఫాదర్ అక్కినేని నాగేశ్వరరావు దేవదాసు తెలుగు వెర్షన్ లో నటించిన సంగతి తెలిసిందే. 1953లో వచ్చిన దేవదాసు సినిమా తెలుగు చిత్రపరిశ్రమలోని బ్లాక్ బస్టర్ చిత్రాలలో ఒకటి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.