Vijay Deverakonda: లైగర్ ప్రమోషన్లలో విజయ్ చెప్పులు వేసుకోవడానికి కారణమదే.. క్లారిటీ ఇచ్చిన రౌడీ స్టైలిస్ట్..

ముఖ్యంగా టీషర్ట్, ఖర్గో ప్యాంట్ తోపాటు దాదాపు 200 రూపాయాల విలువగల చెప్పులతో వచ్చి స్టేజ్ పై కనిపించింది. దీంతో అంత పెద్ద గ్రాండ్‏ ఈవెంట్‏కు విజయ్ నార్మల్ చెప్పులతో రావడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు.

Vijay Deverakonda: లైగర్ ప్రమోషన్లలో విజయ్ చెప్పులు వేసుకోవడానికి కారణమదే.. క్లారిటీ ఇచ్చిన రౌడీ స్టైలిస్ట్..
Vijay Deverakonda
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 05, 2022 | 5:00 PM

ప్రస్తుతం ముంబై వీధులలో లైగర్ (Liger) చిత్రయూనిట్ సందడి చేస్తుంది. గత కొద్ది రోజులుగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), అనన్య పాండే నార్త్ ఆడియన్స్‏తో ఇంట్రాక్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) తెరకెక్కించిన ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓవైపు ట్రైలర్, సాంగ్స్ యూట్యూబ్‏ను షేక్ చేస్తుండగా.. మరోవైపు లైగర్ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ మూవీతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నాడు విజయ్. సినిమా విడుదలకు ముందే రౌడీ హీరోకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. విజయ్ ఆటిడ్యూట్, స్టైలీష్ లుక్‏కు నార్త్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఎప్పుడూ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు విభిన్నంగా ట్రై చేసే విజయ్.. ఇక ఇప్పుడు కూడా మరో దారిని ఎంచుకున్నారు.

ఈ క్రమంలోనే ఇటీవల లైగర్ ప్రమోషన్లలో సింపుల్‏గా రెడీ అయ్యి వచ్చాడు. ముఖ్యంగా టీషర్ట్, ఖర్గో ప్యాంట్ తోపాటు దాదాపు 200 రూపాయాల విలువగల చెప్పులతో వచ్చి స్టేజ్ పై కనిపించింది. దీంతో అంత పెద్ద గ్రాండ్‏ ఈవెంట్‏కు విజయ్ నార్మల్ చెప్పులతో రావడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. బాలీవుడ్ హీరో రణ్వీర్ సైతం విజయ్ ధరించిన చెప్పులపై కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. కేవలం లైగర్ ట్రైలర్ లాంచ్ మాత్రమే కాకుండా.. ఇప్పటివరకు ప్రమోషన్లలోనూ చెప్పులతోనే కనిపిస్తున్నాడు విజయ్. దీంతో రౌడీ హీరో ఈవెంట్లలో ఎందుకు చెప్పులు ధరిస్తున్నాడు అంటూ ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. తాజాగా అందుకు గల కారణాన్ని చెప్పుకొచ్చాడు విజయ్ స్టైలీస్ట్.

ప్రముఖ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్య్వూలో అతను మాట్లాడుతూ.. ఈవెంట్స్ లో చెప్పులు ధరించాలనేది నా స్వీయ ఆలోచన. ఎందుకంటే సినిమాలో అండర్ డాగ్. తన పాత్రతో కనెక్ట్ కావడం కోసం ఇలా చెప్పులు ధరిస్తున్నాడు. అంటూ చెప్పుకొచ్చాడు. బాక్సింగ్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో విజయ్ బాక్సర్ పాత్రలో కనిపించనున్నాడు. అలాగే ప్రపంచ దిగ్గజం మైక్ టైసన్ సైతం ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని కరణ్ జోహర్, ఛార్మి, పూరి జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతోపాటు.. డైరెక్టర్ పూరి జగన్నాథ్, విజయ్ కాంబోలో జనగణమన మూవీ కూడా రాబోతుంది.