Vijay Sethupathi: ట్రెండ్ మారింది.. పట్టపగలు నడిరోడ్డుపై.. విజయసేతుపతిలా వీరంగం..(వీడియో)
ఏ హీరో అయినా.. తన బేర్ బాడీని చూపించాలంటే.. మినిమమ్ సిక్స్ ప్యాక్స్ ఉండాల్సిందే!. లేదంటే.. కండలు తిరిగిన మజిల్స్, క్లియర్‌గా అందరికీ కనిపించాల్సిందే! కాని ఇవేమీ లేకుండా.. ఈ రూల్ నే బ్రేక్ చేసేలా..
ఏ హీరో అయినా.. తన బేర్ బాడీని చూపించాలంటే.. మినిమమ్ సిక్స్ ప్యాక్స్ ఉండాల్సిందే!. లేదంటే.. కండలు తిరిగిన మజిల్స్, క్లియర్‌గా అందరికీ కనిపించాల్సిందే! కాని ఇవేమీ లేకుండా.. ఈ రూల్ నే బ్రేక్ చేసేలా.. కనిపిస్తున్నారు హీరో విజయ్ సేతుపతి. బెల్లీ ఫాట్‌తో..! ఎక్కువగా ఉన్న సైడ్స్‌తో..! తన బేర్ బాడీని సిల్వర్ స్క్రీన్ పై ప్రజెంట్ చేస్తున్నారు ఈహీరో. ఇక ఆ లుక్‌తోనే తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ను ఫిదా చేస్తున్నారు. దీన్నో ట్రెండ్ గా మార్చేస్తున్నారు.అయితే విజయ్ సేతుపతి ఇప్పుడే కాదు.. కెరీర్ బిగినింగ్ నుంచే.. పాత్ బ్రేక్ యాటిట్యూడ్‌తో దూసుకుపోతున్నారు. లేటు వయసులో.. హీరోగా ఎంట్రీ ఇచ్చారు. హీరోగా పీక్స్‌లో ఉండగానే.. ట్రాన్స్ జెండర్ గా కనిపించారు. ఇక ప్రజెంట్ విలన్ గా చేస్తూ.. అందర్నీ ఫిదా చేస్తున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్ హిట్ ఫిల్మ్.. విక్రమ్‌లో కూడా విలన్ గా చేశారు. తన ఎంట్రీ సీన్లో షర్ట్ లేకుండా.. బెల్లీ ఫ్యాట్ తో క్రేజీ గా కనిపించి థియేటర్లో చప్పట్లు కొట్టించుకున్నారు. అయితే ఇదే సీన్‌ను తాజాగా చైన్నై రోడ్లపై రీక్రియేట్ చేశారు ఓ హార్డ్ కోర్ విజయ్ సేతుపతి ఫ్యాన్. సేమ్ టూ సేమ్ విక్రమ్ సినిమాలోని విజయ్ సేతుపతిలానే కనిపించి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాడు. తన ఇస్టాలో విజయ్‌లా రీల్ చేసి పెడుతున్నాడు. అరె అచ్చం విజయ్ సేతుపతిలా ఉన్నాడేంటని అందరి చేత అనిపిస్తున్నాడు. ఇక ఇతడిని లైవ్లో చూసిన వారు నిజంగా విజయ్ సేతుపతే అనుకుని ఎగబడుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్.. సూపర్ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..
Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..