Sita Ramam: థియేటర్లో అభిమానులతో సీతారామం యూనిట్.. సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్..
దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. హీరో
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన మలయాళీ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) .. ఇప్పుడు మరోసారి సీతారామం (Sita Ramam) సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ ప్రేమకథ ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. హీరో సుమంత్ అక్కినేని కీలకపాత్రలలో నటించిన ఈ మూవీ తెలుగు, తమిళం, మలయాళ భాషలలో విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈరోజు ప్రేక్షకులతో కలిసి థియేటర్లో సినిమా చూసిన సీతారామం చిత్రయూనిట్ ఎమోషనల్ అయ్యారు. ప్రదర్శన అనంతరం డైరెక్టర్ హనురాఘవపూడిని హత్తుకుని హీరోయిన్ మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ కన్నీళ్లు పెట్టుకున్నారు.
డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్స్ పై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించారు. యుద్దంతో రాసిన ప్రేమకథ ట్యాగ్‌తో విడుదలైన ఈ మూవీ క్లాసిక్ రొమాంటిక్ సూపర్ హిట్ అంటూ ట్విట్టర్ వేదికగా తెలియజేస్తున్నారు నెటిజన్స్. బ్యాగ్రౌండ్ మ్యూజిక్.. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ కెమిస్ట్రీ.. రష్మిక క్యారెక్టర్స్ సూపర్ అంటూ టాక్ వినిపిస్తోంది. మంచి క్లాసిక్ రొమాంటిక్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అంటున్నారు ప్రేక్షకులు. మొత్తానికి ఎన్నో అంచనాల మధ్య విడుదలైన సీతారామం.. ఆడియన్స్ ను మెప్పించి సూపర్ హిట్ టాక్ అందుకుంది.
ట్వీట్..
That moment ? @dulQuer @mrunal0801 @hanurpudi got emotional after watching movie with fans in Hyderabad#SitaRamamFDFS#SitaRamam @ArtistryBuzz @VyjayanthiFilms #dulqersalman #dulquersalmaan #MrunalThakur #southpaparazzi #tollywoodcelebs pic.twitter.com/zfrIsQWxXw
— ARTISTRYBUZZ (@ArtistryBuzz) August 5, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.