Tollywood: హిట్టు బొమ్మలు.. ప్రిమియర్ కలెక్షన్స్‌తోనే సత్తా చాటిన ‘బింబిసార’ – ‘సీతారామం’..
ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన బింబిసార. సీతారామమ్ సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నాడు. దీంతో ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు.
Bimbisara: బింబిసార.. నందమూరి కళ్యాణ్ రామ్( Kalyan Ram) నటించిన ఈ సినిమా అంచనాలు నిలపుకుంది. మంచి టాక్ సొంతం చేసుకుంది. బింబిసారుడిగా కళ్యాణ్ రామ్ అద్భుతంగా నటించాడని.. కొత్త డైరెక్టర్ వశిష్ఠ బాగా డీల్ చేశాడని టాక్ వస్తుంది. సోషియో ఫాంటసీ సినిమాలు చేయాలంటే నందమూరి హీరోలు బెటర్ ఆప్షన్ అంటున్నారు ఫ్యాన్స్. కాగా ఈ చిత్రం అమెరికా ప్రిమియర్ వసూళ్ల రిపోర్ట్స్ అందాయి. అక్కడ దాదాపు 100 లోకేషన్స్‌లో విడుదలైన ఈ సినిమాకు 35,195 డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా 28 లక్షలు వచ్చినట్లు సమాచారం. కేథరిన్ థ్రెసా, సంయుక్త మీనన్ ఇందులో హీరోయిన్స్‌గా నటించారు ప్రకాశ్ రాజ్, శ్రీనివాస్ రెడ్డి కీ రోల్స్ పోషించారు.
ఇక సీతారామం కూడా సూపర్ లవ్ స్టోరీ అని టాక్ వచ్చేసింది. సినిమా చూసిన ప్రేక్షకులు అద్భుతం అని రివ్యూ ఇచ్చేస్తున్నారు. మహానటి సినిమాలో జెమిని గణేశన్‌గా ఆకట్టుకున్న దుల్కర్ సల్మాన్(Dulquer Salman) ఇందులో హీరోగా నటించాడు. అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమ గాథ, పడిపడి లేచే మనసు వంటి మూవీస్ తీసిన హను రాఘవపూడి దీన్ని తెరకెక్కించారు. ఆయన స్టైల్‌కి తగినట్లుగానే సినిమా మనసులు తాకేలా ఉందన్న రిపోర్ట్ వచ్చింది. ఇక ఈ మూవీ USA ప్రీమియర్ కలెక్షన్స్ రిపోర్ట్ కూడా వచ్చింది. దాదాపు 182 లొకేషన్స్‌లో రిలీజైన ఈ సినిమా 43 లక్షల 23 వేల వరకు కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ వీకెండ్ వచ్చిన రెండు సినిమాలు హిట్ అనమాట. చాలాకాలంగా ఆకలితో ఉన్న తెలుగు మూవీ లవర్స్ ఫుల్ మీల్స్ ఎంజాయ్ చేస్తారు.
మరిన్ని సినిమా వార్తలు చదవండి