Bimbisara Review: ‘బింబిసార’ మూవీ రివ్యూ.. ఇంట్రెస్టింగ్ సోషియో ఫాంటసీ డ్రామా..

Bimbisara Movie Review: బింబిసార గురించి చాలా రోజులుగా ఇండస్ట్రీలో చర్చ జరుగుతూనే ఉంది. రెండు కాలాల మధ్య సాగే సోషియో ఫాంటసీగా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు వశిష్ట.

Bimbisara Review: ‘బింబిసార’ మూవీ రివ్యూ.. ఇంట్రెస్టింగ్ సోషియో ఫాంటసీ డ్రామా..
Bimbisara Movie
Follow us
Janardhan Veluru

|

Updated on: Aug 05, 2022 | 1:32 PM

Bimbisara Movie Review: బింబిసార గురించి చాలా రోజులుగా ఇండస్ట్రీలో చర్చ జరుగుతూనే ఉంది. రెండు కాలాల మధ్య సాగే సోషియో ఫాంటసీగా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు వశిష్ట. మరి ఈ టైమ్ ట్రావెల్ కథ ఎలా ఉంది.. కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో సక్సెస్ అయ్యారా లేదా..?

మూవీ రివ్యూ: బింబిసార

నటీనటులు: కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్, కేథరిన్ థ్రెసా, ప్రకాశ్ రాజ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు

ఇవి కూడా చదవండి

సంగీత దర్శకుడు: ఎం ఎం కీరవాణి, చిరంతన్ భట్

సినిమాటోగ్రఫీ: ఛోటా కె. నాయుడు

ఎడిటర్: తమ్మి రాజు

నిర్మాత: హరికృష్ణ కె

దర్శకత్వం : మల్లిడి వశిష్ట్

విడుదల తేదీ: 05/08/22

కథ:

బింబిసారుడు (కళ్యాణ్ రామ్) త్రిగర్తల సామ్రాజ్యాధిపతి. జాలి, దయ అనేవి ఆయన రక్తంలోనే ఉండవు.. తన రాజ్యంలో ప్రజల్ని పురుగుల కంటే హీనంగా చూస్తుంటారు. ఎదురు తిరిగితే పండు ముసలి అయినా.. పసిపాప అయినా కనికరం లేకుండా కత్తికి బలిచ్చే నిరంకుశ పాలకుడు బింబిసారుడు. అలాంటి రాజు అనుకోని పరిస్థితుల్లో క్రీస్తు పూర్వం 500వ ఏడాది నుంచి 2022కి వస్తాడు. మరోవైపు ఈ కాలంలోకి బింబిసారుడు వచ్చాడని తెలుసుకుని అతడి కోసం డాక్టర్ శాస్త్రి (వారిన హుస్సేన్)తో పాటు, కేతు (అయ్యప్ప పి శర్మ) తిరుగుతుంటారు. అసలు వాళ్ళకు, బింబిసారుడికి సంబంధం ఏంటి..? ఎలా బింబిసారుడు ఆ కాలం నుంచి ఈ కాలానికి వస్తాడు..? ఈ టైమ్ ట్రావెల్ వెనక అసలు కథేంటి అనేది తెరపై చూడాల్సిందే.

కథనం:

బింబిసార.. చాలా రోజుల నుంచి ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు. 500BC రాజును.. ఈ కాలానికి ఎలా లింక్ పెట్టి ఉంటారు అనే ఆసక్తి అందరిలోనూ బాగా పెరిగింది. కొత్త దర్శకుడు వశిష్ట ఈ విషయంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు. ఎంతో కన్ఫ్యూజన్ ఉన్న కథను.. చాలా క్లారిటీగా రాసుకున్నాడు. చందమామ కథలా సినిమాను మొదలుపెట్టాడు కాబట్టి లాజిక్స్ వెతకాల్సిన అవసరం లేదు. ఫస్టాఫ్ అంతా బింబిసారుడి అరాచకాలు.. సెకండాఫ్ ఆయనలో మార్పు.. ఈ రెండింటిని బాగానే బ్యాలెన్స్ చేశాడు దర్శకుడు వశిష్ట. కళ్యాణ్ రామ్ అయితే దర్శకుడిని పూర్తికా నమ్మి అతను చెప్పింది చేశాడు అనిపించింది. బింబిసారుడిగా అతని క్రూరత్వం చూస్తే భయమేస్తుంది.. మనకే చంపేయాలనేంత కసి పుడుతుంది. అదే రాజు.. ప్రస్తుత కాలానికి వచ్చిన తర్వాత పడే తిప్పలు చూస్తుంటే జాలేస్తుంది. ఈ సీక్వెన్స్ అంతా అప్పట్లో యమగోల సినిమాలో యముడు భూమిపైకి వచ్చినపుడు పడే కష్టాల్లా ఉంటాయి. వాటినే ఇక్కడ కూడా చూపించారు దర్శకుడు. విజువల్ ఎఫెక్ట్స్ కంటే కథనే ఎక్కువగా నమ్ముకున్నాడు దర్శకుడు వశిష్ట. చాలా చిన్న కథను ఎమోషనల్ గా చెప్పే ప్రయత్నం చేశారు. మధ్యలో కైకాల సత్యనారాయణ ఘటోత్కచుడు.. క్లైమాక్స్‌లో అంజి సినిమాలు గుర్తుకొస్తాయి. పాప సెంటిమెంట్ అయితే చాలా వరకు ఘటోత్కచుడు గుర్తుకు తెస్తుంది. ఈ క్రమంలో మాస్ ఆడియన్స్ కోరుకునే కమర్షియల్ అంశాలు కూడా బాగానే ఇచ్చాడు.

నటీనటులు:

కళ్యాణ్ రామ్ బింబిసారుడి పాత్రకు ప్రాణం పోశారు. రెండు షేడ్స్‌లోనూ అదరగొట్టారు ఈయన. ముఖ్యంగా ఆయన హావభావాలు మామూలుగా లేవు. సెకండాఫ్‌లో మారిన బింబిసారుడు అద్భుతంగా నచ్చేస్తాడు. హీరోయిన్స్ సంయుక్త మీనన్, కేథరిన్ థ్రెసా ఉన్నారంటే ఉన్నారంతే. ప్రకాశ్ రాజ్ బాగున్నారు.. ఉన్నంత వరకు బాగానే చేసారు. విలన్స్‌గా అయ్యప్ప పి శర్మ, వారిన హుస్సేన్ బాగున్నారు.. మిగిలిన వాళ్లంతా ఓకే.

టెక్నికల్ టీం:

చిరంతన్ భట్ పాటలు అంతగా ఆకట్టుకోలేదు కానీ.. కీరవాణి ఆర్ఆర్ మాత్రం అదిరిపోయింది. అడగాలే గానీ పాట కూడా చాలా బాగుంది. సినిమాకు రీ రికార్డింగ్ కూడా బాగుంది. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్‌లో ఆర్ఆర్ అదిరిపోయింది. కీరవాణి ఈ సినిమాకు మెయిన్ హీరో. ఛోటా కే నాయుడు సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. తమ్మిరాజు ఎడిటింగ్ కూడా షార్ప్‌గా ఉంది. దర్శకుడు వశిష్ట చందమామ కథలా దీన్ని ఓపెన్ చేసారు.. దాన్ని అలాగే కంటిన్యూ చేసారు. దాంతో ఎక్కడా లాజిక్కులకు తావులేదు. ఉన్నంతలో చాలా గ్రాండియర్‌గా సినిమా చేసారు. కాకపోతే కథ విషయంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకోవాల్సింది.

పంచ్ లైన్:

ఓవరాల్ గా బింబిసార.. ఆకట్టుకునే సోషియో ఫాంటసీ

– ప్రవీణ్ కుమార్, టీవీ9 తెలుగు

మరిన్ని సినిమా రివ్యూస్ చదవండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే