AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: మూడు కాళ్లు ఉన్న యువతి? ఈ ఫోటో తప్పును కనిపెడితే మీరే జీనియస్.. గుర్తించగలరా!

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు.. ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్‌లో బాగా ప్రాచుర్యం పొందాయి. వీటిని సాల్వ్ చేయాలంటే..

Viral Photo: మూడు కాళ్లు ఉన్న యువతి? ఈ ఫోటో తప్పును కనిపెడితే మీరే జీనియస్.. గుర్తించగలరా!
Three Leg Girl
Ravi Kiran
|

Updated on: Aug 05, 2022 | 6:59 PM

Share

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు.. ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్‌లో బాగా ప్రాచుర్యం పొందాయి. వీటిని సాల్వ్ చేయాలంటే.. మీ మెదడుకు పదును పెట్టడమే కాదు.. కళ్లు కూడా బాగా షార్ప్‌గా ఉండాలి. చిత్రంలో పైకి కనిపించేది ఒకటయితే.. లోపల ఉండే ఆన్సర్ మరొకటి. మిమ్మల్ని మకతిక.. తికమక పెడతాయి. ఎప్పుడూ ఏదొక పజిల్‌ను సాల్వ్ చేసేవాళ్లకు ఇలాంటి చిత్రాలు మాంచి కిక్కిస్తాయి. ఏదైనా ప్రతీ పనిలోనూ ఓ పజిల్ ఉండాలి.. అప్పుడే కిక్కుంటుంది. అలాగే ఈ ఫోటోలు కూడా మిమ్మల్ని కచ్చితంగా ఆశ్చర్యానికి గురి చేస్తాయి. చాలామంది ఈ ఫోటో పజిల్స్‌ను తగ్గేదేలే అన్నట్లుగా ఓ పట్టు పడతారు. మరి మీ సంగతేంటి.! తాజాగా ఈ కోవకు చెందిన ఓ ఫోటో పజిల్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అది మీ ఐ పవర్‌ను కచ్చితంగా టెస్ట్ చేస్తుంది.

పైన పేర్కొన్న ఫోటోను చూస్తుంటే.. కచ్చితంగా అదొక ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో తీసుకున్నట్లు ఉందని అర్ధమవుతుంది. కరెక్టే మీరు గెస్ చేసింది. ఇక ఆ ఫోటో మీకు డార్క్ రెడ్ కలర్ హుడీ(Hoodie) వేసుకుని అటువైపు తిరిగిన అమ్మాయిని చూశారా.? ఆమెకు మూడు కాళ్లు ఉన్నట్లు ఫోటోలో కనిపిస్తోంది కదా.! అది నిజమంటారా.? ఫోటోను పైపైన చూడటం కాదు.. నిశితంగా పరిశీలిస్తే మీకు సమాధానం దొరుకుతుంది.

సాధారణంగా విజువల్ ఇల్యూషన్ చిత్రాలు.. సైకాలజిస్టులు బాగా ఉపయోగిస్తారు. వీటి ద్వారా తమ దగ్గరకు వచ్చిన పేషెంట్ల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుంటుంటారు. అయితే ఇదంతా పక్కన పెడితే.. ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో అసలు ఆ అమ్మాయికి ఆ మూడో లెగ్ ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టండి.. సమాధానం దొరికితే కామెంట్స్‌లో చెప్పండి.

ఈ ఫోటోలో ఉన్న మహిళకు మూడు కాళ్లు ఎందుకు ఉన్నాయి?

మీరు ఊహించినట్లుగానే ఆమె, పక్కన సీటులో మరో యువతి కూర్చున్నారు. ఇద్దరూ ఒకే రకమైన డ్రెస్, బూట్లు ధరించారు. పోనీటైల్ అమ్మాయి కొంచెం సైడ్‌కు తిరిగి కూర్చోగా.. ఆమె పక్కన కూర్చున్న యువతి రెండు కాళ్లు నేలపైన ఉంచింది. ఇక ఫోటోగ్రాఫర్ తెలివిగా ఒకే అమ్మాయికి మూడు కాళ్లు ఉన్నాయని చెప్పే విధంగా కెమెరాను క్లిక్ చేశాడు.