Chocolate Cookies: ఫ్రెండ్‌షిప్ డే గిఫ్ట్ గా చాక్లెట్ కుకీలు బెస్ట్ ఎంపిక.. మీరు స్వయంగా తయారు చేసి ఇవ్వాలనుకుంటే రెసిపీ మీకోసం

మీరు  స్వయంగా తయారు చేసి స్నేహితుడికి బహుమతిగా ఇస్తే..మీరు ఇచ్చే బహుమతిని మీ స్నేహితుడు చాలా ఇష్టపడతాడు. ఈరోజు చాక్లెట్ కుకీ తయారీ గురించి తెలుసుకుందాం.. 

Chocolate Cookies: ఫ్రెండ్‌షిప్ డే గిఫ్ట్ గా చాక్లెట్ కుకీలు బెస్ట్ ఎంపిక.. మీరు స్వయంగా తయారు చేసి ఇవ్వాలనుకుంటే రెసిపీ మీకోసం
Chocolate Cookies
Follow us

|

Updated on: Aug 05, 2022 | 7:24 PM

Chocolate Cookies: జీవితంలో చోటు చేసుకునే మంచిచెడులకు తోడుగా నీడగా ఉండేవారు స్నేహితులు. అలాంటి స్నేహితుల స్నేహానికి కృతఙ్ఞతలు తెలిపే రోజునే ఫ్రెండ్‌షిప్ డే. ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం రోజున ఫ్రెండ్‌షిప్ డే జరుపుకుంటారు . ఈ ఏడాది ఆగష్టు  7వ తేదీ  ఆదివారం రోజున ఫ్రెండ్‌షిప్ డే జరుపుకోనున్నాము. మీరు ఈ రోజున మీ స్నేహితుడికి స్వయంగా తయారు చేసిన వస్తువులను బహుమతిగా ఇవ్వాలనుకుంటే..  చాక్లెట్ కుకీలు బెస్ట్ ఎంపిక. చాక్లెట్ చిప్స్‌తో తయారుచేసిన చాక్లెట్ కుకీలను ఎవరు ఇష్టపడరు చెప్పండి. మీరు  స్వయంగా తయారు చేసి స్నేహితుడికి బహుమతిగా ఇస్తే..మీరు ఇచ్చే బహుమతిని మీ స్నేహితుడు చాలా ఇష్టపడతాడు. ఈరోజు చాక్లెట్ కుకీ తయారీ గురించి తెలుసుకుందాం..

చాక్లెట్ కుకీల తయారీకి కావల్సిన పదార్ధాలు:  ఒక కప్పు తురిమిన చాక్లెట్, అరకప్పు మిల్క్ పౌడర్, మూడు వంతుల వెన్న, పావు కప్పు మైదా, రెండు టీస్పూన్ల కాస్టర్ షుగర్, రెండు టీస్పూన్ల బ్రౌన్ షుగర్, పావు కప్పు కండెన్స్‌డ్ మిల్క్, సగం టీస్పూన్ వెనిల్లా ఎసెన్స్, పావు కప్పు చాక్లెట్ చిప్స్.

తయారీ విధానం: మొదట మైదా పిండిని జల్లెడ పట్టి ఒక గిన్నెలో వేసుకోండి. అందులో పాలు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో డార్క్ చాక్లెట్ వేసి మైక్రోవేవ్‌లో 30 నుండి 40 ఉష్ణోగ్రత వద్ద ఉంచండి. అప్పుడు చాక్లెట్ కరుగుతుంది.

ఇవి కూడా చదవండి

లోతైన గిన్నెలో వెన్న, కాస్టర్ షుగర్ , బ్రౌన్ షుగర్ వేసి 6 నుండి 7 నిమిషాల పాటు గిలకొట్టండి. ఈ మిశ్రమం చాలా స్మూత్‌గా క్రీమ్‌గా మారే వరకు మిక్స్ చేయండి. అనంతరం ఈ మిశ్రమంలో కండెన్స్‌డ్ మిల్క్, మెల్టెడ్ చాక్లెట్, వెనీలా ఎసెన్స్ వేసి అన్నింటినీ బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో మైదా, పాలు కలిపి మెత్తని పిండిలా కలుపుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమానికి చాక్లెట్ చిప్స్ జోడించండి. దీని తరువాత, పిండిపై సన్నని రేకును వేసి.. 20 నిమిషాలు పక్కకు పెట్టుకోండి. దీని తర్వాత బేకింగ్ ట్రేలో అల్యూమినియం ఫాయిల్ షీట్ ఉంచండి. ఐస్ క్రీం స్కూప్ నుండి పిండిని తీసి అల్యూమినియం ఫాయిల్ ట్రేలో సమాన దూరం ఉంచండి. ఫోర్క్ సహాయంతో సన్నని, ఫ్లాట్, గుండ్రని ఇలా నచ్చిన షేప్ లో కుకీలను కట్ చేయండి. అనంతరం వీటిని 160 డిగ్రీల వద్ద 45 నిమిషాల పాటు ఓవెన్‌లో పెట్టి కాల్చండి. ఆ తర్వాత చల్లారనివ్వాలి. తర్వాత గాలి చొరబడని కంటైనర్‌లో ఉంచి స్నేహితుడి కోసం నచ్చిన విధంగా ఈ చాక్లెట్ కుకీలను ప్యాక్ చేసి.. గిఫ్ట్ గా ఇవ్వండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి