Brinjal Farming: అన్నదాతకు సిరుల పంట వంగ పంట.. వర్షాకాలంలో వచ్చే వంకాయలకు మార్కెట్ లో భారీ గిరాకీ.. లక్షల్లో ఆదాయం

వర్షాకాలంలో పండే వంకాయ చాలా మంచి పంట అని.. మార్కెట్‌లో డిమాండ్‌ ఉంటుందని రైతులు చెబుతున్నారు. ఏప్రిల్‌లో వేసిన పంట వర్షం రాగానే మార్కెట్‌కు రావడం ప్రారంభమవుతుంది.

Brinjal Farming: అన్నదాతకు సిరుల పంట వంగ పంట.. వర్షాకాలంలో వచ్చే వంకాయలకు మార్కెట్ లో భారీ గిరాకీ.. లక్షల్లో ఆదాయం
Brinjal Farming
Surya Kala

|

Aug 05, 2022 | 7:05 PM

Brinjal Farming: అన్నదాత ఆర్ధికంగా స్థిరపడాలన్నా.. కష్టాలను అధిగమించాలన్నా.. అధిక ఆదాయం ఇచ్చే పంటను పండించాల్సి ఉంటుంది. అందువల్లనే ప్రస్తుతం రైతుల దృష్టి అత్యధిక ఆదాయాన్ని ఇచ్చే పంటల సాగుపైనే ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. కొంతమంది రైతులు మేలైన వంగడాలతో అధిక దిగుబడినిచ్చే పంటలను పండిస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లా రైతులు కొన్ని ఎంపిక చేసిన వంకాయలను పండిస్తున్నారు. భారీ ఉత్పత్తిని పొందుతున్నారు. ఈ వంటకాయల అమ్మకాలతో ఆదాయాలు పెరుగుతుంది. జిల్లాలోని  రైతులు వంగ పంటను వేస్తున్నారు. వర్షాకాలంలో పండే వంకాయ చాలా మంచి పంట అని.. మార్కెట్‌లో డిమాండ్‌ ఉంటుందని రైతులు చెబుతున్నారు. ఏప్రిల్‌లో వేసిన పంట వర్షం రాగానే మార్కెట్‌కు రావడం ప్రారంభమవుతుంది. పర్సోలాకు చెందిన రైతు సందీప్‌ మాట్లాడుతూ.. తాను చాలా కాలంగా వంగ పంటను సాగుచేస్తున్నానని తెలిపారు. ఇది ఉత్తమ లాభదాయకమైన పంటగా చెబుతున్నాడు.

ఈ పంట దిగుబడి వర్షాకాలంలో వచ్చే విధంగా వేసవి కాలంలోని ఏప్రిల్‌లో విత్తినట్లు రైతు చెప్పారు. ఏప్రిల్‌లో వేసిన పంట వర్షాకాలంలో దిగుబడి వచ్చి.. మార్కెట్‌లో వేగంగా అమ్ముడవుతోంది. తొలిదశలో హైబ్రిడ్ రకం విత్తనాన్ని వినియోగించినట్లు రైతు తెలిపారు. ఒక హెక్టారులో సుమారు 300 గ్రాముల విత్తనాలు విత్తినట్లు చెప్పారు. వంగ పంటకు పొలం సిద్ధం చేసే సమయంలో  ఎరువుగా పేడను వేస్తామని చెప్పారు. అనంతరం పొలాన్ని  దున్ని తర్వాత కలుపు మొక్కలను తొలగిస్తారు. రెండో సారి దున్ని వరి నాట్లు వేశారు. మూడోసారి దున్నిన తర్వాత పొలాల్లోని గట్లపై విత్తనాలు నాటారు.

ఒక హెక్టారులో 400 క్వింటాళ్ల దిగుబడి క్షేత్రస్థాయిలో వంగ మొక్కలు పెరగడానికి పంట దిగుబడి కోసం డీఏపీ ఉపయోగిస్తారు. అవసరాన్ని బట్టి ఎప్పటికప్పుడు నీరు అందించాల్సి ఉంది. సకాలంలో వంకాయ పంట రావడం ప్రారంభమవుతుంది. వంకాయ పుష్పించే సమయంలో డ్రిప్‌ ఇరిగేషన్‌ పద్ధతిలో ద్రవ రూపంలో ఎరువును మొక్కలకు అందిస్తారు. ఇలా చేయడం వలన వంకాయలు భారీ మొత్తంలో దిగుబడి వస్తోంది. మార్కెట్‌లో ప్రతివారం వంకాయలు విక్రయిస్తూ భారీగా లాభాలు గడిస్తున్నారు. ఇలా వంకాయ సుమారు 10 నెలల పాటు దిగుబడినిస్తుందని చెప్పారు.

1 హెక్టారులో 400 క్వింటాళ్ల వరకు వంకాయలు పండించవచ్చని రైతు తెలిపారు. కీటకాల నుండి మొక్కలను రక్షించడానికి, ఎప్పటికప్పుడు పురుగుమందులను పిచికారీ చేయడం చాలా ముఖ్యం. ఆవు మూత్రం, వేప ద్రావణాన్ని కూడా ఎప్పటికప్పుడు పిచికారీ చేస్తూనే ఉన్నానని రైతు తెలిపాడు. తెగుళ్ళ నుండి రక్షించడానికి ఇది చాలా ముఖ్యమైంది. మొదటి సారిగా వంకాయ సాగు చేయడం వల్ల సుమారు 2 లక్షల వరకు లాభం వచ్చిందని రైతు తెలిపారు. 10 నెలల్లో దాదాపు 10 లక్షల లాభం వస్తుందని అంచనా. వాతావరణం అనుకూలంగా ఉంటె ఈసారి ఆదాయం అత్యధికంగా ఉంటుందని రైతు ధీమా వ్యక్తం చేస్తారు.

మెరుగవుతోన్న రైతు ఆర్ధిక పరిస్థితి: హర్దోయ్ జిల్లాలో వంకాయలు విరివిగా సాగుచేస్తున్నట్లు జిల్లా ఉద్యానశాఖ అధికారి సురేష్ కుమార్ చెప్పారు.  ఇక్కడ పండే వంకాయలు ఢిల్లీ, మధ్యప్రదేశ్‌తో పాటు లక్నో, కాన్పూర్, ఫరూఖాబాద్‌లకు పంపిణీ చేస్తున్నారు. రైతులకు ఎరువుల ఆవశ్యకత, చీడపీడల నివారణ, ఉత్తమ విత్తనాల ఎంపిక, వంకాయలు వేసే పద్ధతులపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నామన్నారు. జిల్లాకు చెందిన రైతులు ఉద్యానవన శాఖతో సంప్రదింపులు జరుపుతున్నారు. పంటలు బాగా పండడంతో రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగవుతోందని హర్షం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu