AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Relationship Tips: మనసులోని మాటలను మీ క్రష్‏కు చెప్పాలనుకుంటున్నారా..? వారి హృదయాన్ని ఇలా గెలుచుకోండి..

చాలా మందికి ఆఫీస్, కాలేజీ లాంటి చోట ఎవరితోనైనా, ఎవరో ఒకరిపైనా ప్రేమ ఉంటుంది. అదే సమయంలో చాలా మంది క్రష్‌లో ఉన్నప్పుడు నేరుగా తమ హృదయంలోని మాటను ప్రేమించే వారికి చెప్పేందుకు భయపడుతుంటారు.

Relationship Tips: మనసులోని మాటలను మీ క్రష్‏కు చెప్పాలనుకుంటున్నారా..? వారి హృదయాన్ని ఇలా గెలుచుకోండి..
Love
Shaik Madar Saheb
|

Updated on: Aug 06, 2022 | 11:29 AM

Share

Relationship Tips: ప్రేమ అనేది ఒక అద్భుతమైన అనుభూతి.. ప్రపంచంలో ప్రేమించని వారంటూ ఎవరూ ఉండరు.. వయస్సుతో సంబంధం లేకుండా ప్రేమించడం, ప్రేమించబడటం రెండూ వరమే.. అవును మనం ఎవరినైనా ప్రేమిస్తున్నప్పుడు, అతనితో లేదా ఆమెతో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతాము. అదే సమయంలో మనం ఎవరినైనా ఇష్టపడినప్పుడు.. దానికి క్రష్ అనే పదాన్ని ఉపయోగిస్తాము. చాలా మందికి ఆఫీస్, కాలేజీ లాంటి చోట ఎవరితోనైనా, ఎవరో ఒకరిపైనా ప్రేమ ఉంటుంది. అదే సమయంలో చాలా మంది క్రష్‌లో ఉన్నప్పుడు నేరుగా తమ హృదయంలోని మాటను ప్రేమించే వారికి చెప్పేందుకు భయపడుతుంటారు. కొందరు మోహమాటంతో తమ స్నేహితుల ద్వారా.. ప్రియురాలికి లేదా ప్రియుడికి చేరవేస్తారు. అదే సమయంలో మరికొందరు తమ మనసులోని మాటను సూటిగా చెప్పడానికి సంకోచిస్తుంటారు. అచ్చం అలాంటి పరిస్థితినే మీరు ఎదుర్కొంటున్నట్లయితే.. చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ ప్రేమను.. మీ హృదయంలోని మాటను ఎలా చెప్పాలో.. ఎక్కడ చెప్పాలో ఇప్పుడు తెలుసుకుందాం..

మీ ప్రేమను ఈ మార్గాల్లో చెప్పండి..

లవ్ ఎమోజీ షేర్ చేయండి..

ఇవి కూడా చదవండి

మీరు వాట్సాప్‌లో కూడా ప్రేమించే వారికి సందేశాన్ని పంపవచ్చు. లవ్ ఎమోజీని షేర్ చేసి మీ హృదయంలో మాటను చెప్పవచ్చు. ప్రేమను వ్యక్తపరచడంలో ఎమోజి మీకు సహాయం చేస్తుంది. మీ మధ్య సంభాషణ సమయంలో మీ క్రష్‌కు వ్యక్తపరచడం కోసం హార్ట్ ఎమోజీని పంపవచ్చు. అయితే క్రష్‌తో స్నేహపూర్వకంగా మాట్లాడినట్లయితే.. ఈ ఎమోజీని పంపడం ద్వారా సరసాలాడవచ్చు. మీరు అతన్ని లేదా ఆమెను ఇష్టపడుతున్నారని సూచన కావచ్చు. ఇలా చేయడం ద్వారా మీ ప్రేమను మీ భావాలను షేర్ చేసుకోవచ్చు.

కాంప్లిమెంట్..

ఆఫీసులో లేదా మీరు పనిచేసే చోట ఎవరితోనైనా క్రష్ ఉంటే.. మీరు అతనిని లేదా ఆమె సరసాలాడుకునే పద్ధతిలో ప్రశంసించవచ్చు. ఇష్టపడేవారి కళ్లను చూసి మెచ్చుకోవచ్చు. మీ పొగడ్తలు ప్రేమించే వారిని ఆశ్చర్యపోయేలా చేయవచ్చు. ఈ విధంగా అతను లేదా ఆమె ఇష్టపడేవారి హృదయంలోని మాటను అర్థం చేసుకుంటాడు.

కలిసి సమయం గడపడానికి ప్రయత్నించండి..

మీరు పనిచేసే చోట.. మీ వెంట పనిచేసే వారిపై ప్రేమ ఉంటే అతను లేదా ఆమెతో కూర్చోవడానికి ప్రయత్నించండి. పనిలో సహాయం చేయడానికి ప్రయత్నించండి. టిఫిన్, భోజనం చేయండి.. ఎక్కువ సమయం కంపెనీ ఇవ్వండి. ఇది మీకు కలిసి గడపడానికి అవకాశం ఇస్తుంది. మీరు మీ క్రష్‌తో సమయం గడిపినప్పుడు అతను లేదా ఆమె భావాల గురించి తెలుసుకోవడం ప్రారంభిస్తారు.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..