Viral Video: ఈ ఉడుత మామూలిది కాదండోయ్‌.. పాముకు సవాల్ చేసి మరి పొట్లాటకు దిగింది.. వీడియో

ఒక్కోసారి వేటగాడే బలిపశువుగా మారడం కనిపిస్తుంది. అయితే.. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఉడుత.. పామును అతి కిరాతకంగా వేటాడి చంపింది.

Viral Video: ఈ ఉడుత మామూలిది కాదండోయ్‌.. పాముకు సవాల్ చేసి మరి పొట్లాటకు దిగింది.. వీడియో
Viral Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 06, 2022 | 9:18 AM

Squirrel – Snake fighting video: సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వైరల్ వార్తలు, వీడియోలు తెరపైకి వస్తుంటాయి. ఇవి చూస్తుంటే.. ఆశ్చర్యం కలుగుతుంది. కొన్ని వీడియోలు ఫన్నీగా.. మరికొన్ని హర్రర్ గా ఉంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలైతే భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే అడవి ప్రపంచంలో నిత్యం సంఘర్షణ జరుగుతుంటుంది. ఆహారం కోసం.. పెద్ద జంతువులు.. చిన్న జంతువులను వేటాడుతుంటాయి. ఈ ప్రక్రియ నిత్యం జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ.. ఎప్పుడు ఎవరు గెలుస్తారో చెప్పడం చాలా కష్టం. ఒక్కోసారి వేటగాడే బలిపశువుగా మారడం కనిపిస్తుంది. అయితే.. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఉడుత.. పామును అతి కిరాతకంగా వేటాడి చంపింది. ఈ వీడియో చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

సాధారణంగా పామును చూడగానే చాలామందికి వణుకుపుడుతుంది. మనుషులు, జంతువులు కూడా వాటికి భయపడతాయి. కానీ.. అలాంటి పాముకు ఓ ఉడుత సవాల్ విసిరింది. పాము, ఉడుత రెండూ హోరాహోరిగా పొట్లాటకు దిగాయి. ఉడుత ఏమాత్రం తగ్గేదేలే అంటూ పామును ముప్పుతిప్పలు పెట్టి మరి ఓడించింది. వైరల్ అవుతున్న వీడియోలో పాము కదులుతున్నప్పుడు.. ఉడుత మొదట ఆగిపోతుంది. ముందు పాము ఉడుతపై దాడి చేస్తుంది. ఆ తర్వాత వెంటనే ఉడుత.. ప్రతీకారంగా పాము మెడను గట్టిగా పట్టుకుంది. ఉడుత ఆగ్రహాన్ని చూసి పాము పారిపోవాలని కోరుకుంటుంది. కాని ఉడుత మాత్రం నిరంతరం దాడి చేస్తూ పామును పళ్లతో కొరుకుతుంది. పాముకు ఒక్క అవకాశం కూడా ఇవ్వదు.. పాము చనిపోయే వరకు ఉడుత దాడి చేస్తూనే ఉంటుంది.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో

ఈ వైరల్ వీడియోను కొన్ని రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో hoodnews__global అనే యూజర్ షేర్ చేయగా.. పలువురు వీక్షించి లైకులు చేస్తున్నారు. దీంతోపాటు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. పాముకే.. ఉడుత ముప్పుతిప్పలు పెట్టిందంటే.. ఇది మామూలిది కాదంటూ పేర్కొంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..