చుట్టు వరదతో అడవుల్లో చిక్కుకున్న ముగ్గురు గర్భిణులు.. ఆపద్భాంధవులుగా రక్షించిన రెస్క్యూటీం
రైతుల పొలాలు, పంటలు పూర్తిగా నీటమునిగిపోయాయి. ఇళ్లు, పంటలు తడిసిపోయి ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ వర్షం కారణంగా 3 గర్భిణులు అడవిలో చిక్కుకుపోయారు..
కేరళలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షం కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. చాలా జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. దీంతో 2 వేల మందికి పైగా ప్రజలు సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కేరళలోని కోజికోడ్ జిల్లాలో జలదిగ్బంధం నెలకొంది. రైతుల పొలాలు, పంటలు పూర్తిగా నీటమునిగిపోయాయి. ఇళ్లు, పంటలు తడిసిపోయి ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ వర్షం కారణంగా 3 గర్భిణులు అడవిలో చిక్కుకుపోయారు.. అటవీశాఖ, పోలీసుల సహకారంతో వారిని సురక్షితంగా రక్షించి ఒడ్డుకు చేర్చారు.. అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అదే సమయంలో వారిలో ఒకరు అడవిలోనే ఆడపిల్లకు జన్మనిచ్చింది. సమాచారం ప్రకారం..తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.
Continuing heavy rain in the Kozhikode district of Kerala causes waterlogging. Farmer’s land submerged with water resulting in damage to crops pic.twitter.com/LYC93PNed5
ఇవి కూడా చదవండి— ANI (@ANI) August 5, 2022
పెరింగల్‌కుత్ ద్వారా రెండు కిలోమీటర్ల సాహసయాత్రను కవర్ చేసింది. కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఈ ఘటనను గమనించి గర్భిణులను రక్షించిన బృందాన్ని అభినందించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి