Tirumala Pavithrotsavam: శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మూడు రోజుల పాటూ ఈ దర్శనాలు రద్దు!
Tirumala Pavithrotsavam: తిరుమలలో సాధారణ రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు తరలివస్తున్నారు. ఇక రేపటి నుండి తిరుమలలో శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల కోసం అంతా సిద్ధం చేసింది టీటీడీ. ఆదివారం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. సోమవారం నుంచి మూడు రోజుల పాటూ వార్షిక పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 10వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. 7న అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మూడు రోజులపాటు ఈ […]
Tirumala Pavithrotsavam: తిరుమలలో సాధారణ రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు తరలివస్తున్నారు. ఇక రేపటి నుండి తిరుమలలో శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల కోసం అంతా సిద్ధం చేసింది టీటీడీ. ఆదివారం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. సోమవారం నుంచి మూడు రోజుల పాటూ వార్షిక పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 10వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. 7న అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మూడు రోజులపాటు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.
శ్రీవారి పవిత్రోత్సవాల్లో భాగంగా 8న పవిత్రాల ప్రతిష్ట, 9న పవిత్ర సమర్ఫణ. 10న పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. మూడురోజుల పాటు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం ప్రత్యేక అలంకరణలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇస్తారు. 8న పవిత్రాల ప్రతిష్ట, 9న పవిత్ర సమర్పణ, 10న పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
పవిత్రోత్సవాల సందర్భంగా సోమవారం నుంచి మూడు రోజుల పాటూ ఆర్జిత సేవలు రద్దు చేశారు. అలాగే పవిత్రోత్సవాలకు టికెట్లు పొందిన భక్తులు మూడు రోజులు స్నపన తిరుమంజనంలో, చివరి రోజు పూర్ణాహుతిలో పాల్గొనవచ్చు. పవిత్రోత్సవాల్లో పాల్గొనే భక్తులు సంప్రదాయ వస్త్రధారణలో ఉదయం 7 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్–1 వద్దకు చేరుకోవాలి. టికెట్‌తోపాటు ఏదైనా ఒక ఒరిజి నల్ ఫొటో గుర్తింపు కార్డు తీసుకురావాల్సి ఉంటుందని టీటీడీ స్పష్టం చేసింది.