రాఖీ పండగకు దూరంగా ఉంటున్న గ్రామాలు.. 300 ఏళ్లుగా అదే కారణం..!

దాదాపు నాలుగైదు శతాబ్దాలుగా వారు ఈ పండుగను పూర్తి భిన్నంగా జరుపుకుంటున్నారు. రాఖీ పూర్ణిమ రోజున ఇక్కడి మహిళలు తమ సోదరుల చేతులకు రాఖీలు కట్టరు. అందుకు బదులుగా వారు కలప కర్రలకు

రాఖీ పండగకు దూరంగా ఉంటున్న గ్రామాలు.. 300 ఏళ్లుగా అదే కారణం..!
Rakhi Festival
Follow us

|

Updated on: Aug 06, 2022 | 11:07 AM

అన్ని పండుగలలో కెల్లా రక్షా బంధన్ పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇది అతి పెద్ద పండుగలలో ఒకటి. పంచాంగం ప్రకారం, రక్షాబంధన్ పండుగను ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. దీనిని రాఖీ, రాఖీ పూర్ణిమ అని కూడా అంటారు. రక్షాబంధన్ తోబుట్టువుల మధ్య ప్రేమ, ఆప్యాయతలకు ప్రతీక. ఈ పండుగ రోజున సోదరీమణులు తమ సోదరుడి మణికట్టుపై రాఖీని కట్టి, వారి నుదిటిపై బొట్టుపెట్టి, హారతి పడతారు.. రాఖీ కట్టేటప్పుడు సోదరీమణులు దీర్ఘాయువు, ఆరోగ్యవంతమైన జీవితం, ఆనందం, శ్రేయస్సు, సంపద, వైభవం, వారి సోదరుల ఐశ్వర్యం కోసం దేవుడిని ప్రార్థిస్తారు. రాఖీ కట్టినందుకు ప్రతిఫలంగా సోదరికి సోదరుడు బహుమతులు ఇవ్వటం ఆనవాయితీ. ఆమెను జీవితాంతం కాపాడుతానని వాగ్దానం చేస్తాడు. ఈసారి పవిత్రమైన రక్షాబంధన్ పండుగను ఆగస్టు 11న జరుపుకోనున్నారు. అయితే, ఎంతో విశిష్టత కలిగిన ఈ రాఖీపౌర్ణమిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో మాత్రం అస్సలు ఈ పండుగను జరుపుకోరట. వినడానికి వింగా అనిపించినా ఇదే నిజమే.. అందుకు బలమైన కారణం ఉందని అంటున్నారు అక్కడివారు. అదేమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

యూపీలోని హార్పూర్ జిల్లా పరిధిలోని 60 గ్రామాల్లో ప్రజలు రక్షా బంధన్ జరుపుకోరట. అంటే, అందరిలా జరుపుకోరు. వారు జరుపుకునే విధానం పూర్తిగా వేరుగా ఉంటుందట.. దాదాపు నాలుగైదు శతాబ్దాలుగా వారు ఈ పండుగను పూర్తి భిన్నంగా జరుపుకుంటున్నారు. రాఖీ పూర్ణిమ రోజున ఇక్కడి మహిళలు తమ సోదరుల చేతులకు రాఖీలు కట్టరు. అందుకు బదులుగా వారు కలప కర్రల కు రాఖీలు కడతారు. అందువల్ల పండుగ నాడు ఎక్కడ చూసినా కర్రలకు రాఖీలు కనిపిస్తాయి.

ఇకపోతే, మీరట్ లోని మరో గ్రామంలో మరో విధంగా రాఖీని జరుపుకుంటారు. మీరట్‌లోని సురానా అనే గ్రామంలో పూర్వకాలం శాపం కారణంగా అక్కడ రక్షా బంధన్ జరుపుకోరు. 12వ శతాబ్దంలో రాఖీ పండుగ రోజున మహ్మద్ ఘోరీ ఆ గ్రామంపై దండెత్తాడు. ఊళ్లో ప్రజలందరినీ చంపేశాడు. ఓ మహిళ, ఆమె ఇద్దరు కొడుకులు మాత్రం బతికారు. ఎందుకంటే వారు ఆ రోజున ఊళ్లో లేరు. ఆ తర్వాత చుట్టుపక్కల ఊళ్ల వారు అక్కడ నివసించారు. ఏడాది తర్వాత వారు రాఖీ పండుగ జరుపుకుందామని ప్రయత్నించారు. ఆ రోజున ఓ పిల్లాడు ప్రమాదవశాత్తు చూపు కొల్పోయాడట. దాంతో గ్రామంలో రాఖీపండను నిషేధించారు. అలా గత 300 ఏళ్లుగా రాఖీ పండుగను బ్యాన్ చేశారు.. అప్పటి నుంచి అక్కడ రాఖీ అన్న మాట కనుమరుగైపోయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి