Telangana: కలకలం రేపుతున్న కల్తీ కల్లు.. ఆరుగురికి అస్వస్థత.. విచారణలో సంచలనాలు..!

నల్గొండ జిల్లాలో కల్తీ కల్లు కలకలం రేపుతోంది. గీత కార్మికుడి వద్ద కల్లు తాగిన ఆరుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారందరిని సమీప ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Telangana: కలకలం రేపుతున్న కల్తీ కల్లు.. ఆరుగురికి అస్వస్థత.. విచారణలో సంచలనాలు..!
Adulterated Toddy
Follow us
M Revan Reddy

| Edited By: Balaraju Goud

Updated on: Dec 26, 2024 | 8:34 AM

నల్గొండ జిల్లాలో కల్తీ కల్లు కలకలం సృష్టించింది. కల్తీ కల్లు తాగిన ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం పెర్కకొండారంకు చెందిన దుబ్బాక అచ్చయ్య, పాక పిచ్చయ్య, వల్లపు లింగయ్య, మేడిపల్లి భిక్షం, గంట రామచంద్రయ్య, కన్నీబోయిన నరేష్ వ్యవసాయ కూలీలు పనిచేస్తున్నారు. రోజు మాదిరిగానే గ్రామానికి చెందిన గీత కార్మికుడి వద్ద గ్రామ శివారులో ఉన్న కుమ్మరి కుంట వద్ద మధ్యాహ్నం కల్లు తాగారు. అయితే అనుహ్యంగా వారంతా అస్వస్థతకు గురయ్యారు.

కల్లు తాగిన వారంతా సాయంత్రం ఐదు గంటల సమయంలో ఇంటికి చేరుకున్నారు. అయితే వీరందరికీ వాంతులు, విరేచనాలు, వనకడం ప్రారంభమయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు బాధితులను నకిరేకల్ ఆసుపత్రికి తరలించారు. బాధితులకు వైద్యులు పరీక్షలు నిర్వహించి కల్తీ కల్లు తాగడం వల్లే వాంతులు, విరేచనాలు అవుతున్నాయని వైద్యులు తెలిపారు. వీరిలో దుబ్బాక అచ్చయ్య, పాక పిచ్చయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. కల్తీ కల్లు ఘటనపై ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కల్లు కల్తీ కావడానికి గల కారణాలపై ఆదా తీస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే