Viral Video: అందుకే అంటారు రోడ్డు చూసి నడపాలని.. స్టైల్‏గా రీల్ చేసింది.. చివరకు..

అక్కడ ఒక అమ్మాయి తన పొరపాటు వల్ల నవ్వులపాలైంది. ఇందులో స్నేహితులను ఆటపట్టించడానికి ఆమె చేసిన స్టంట్‌ బెడిసికొట్టింది.

Viral Video: అందుకే అంటారు రోడ్డు చూసి నడపాలని.. స్టైల్‏గా రీల్ చేసింది.. చివరకు..
Girl Having Fun
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 06, 2022 | 10:24 AM

సోషల్ మీడియా ప్రపంచం ఫన్నీ వీడియోలతో నిండిపోయింది. ఇది ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో వీడియోలను చూసే,అప్‌లోడ్ చేసే ప్లాట్‌ఫారమ్. వాటిలో కొన్ని మిమ్మల్ని భావోద్వేగానికి గురి చేస్తాయి. మరికొన్ని మిమ్మల్ని చాలా నవ్విస్తాయి. అలాంటి వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. అక్కడ ఒక అమ్మాయి తన పొరపాటు వల్ల నవ్వులపాలైంది. ఇందులో స్నేహితులను ఆటపట్టించడానికి ఆమె చేసిన స్టంట్‌ బెడిసికొట్టింది. దాంతో తనకే పెద్ద పంచ్‌ పడినట్టైంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఓ అమ్మాయి స్కూటీపై వెళ్తోంది. రోడ్డు మీద బండి నడుపుతూ జాలిగా వెళ్తోంది. అయితే, ఆమె ముందు దూరంగా నిలబడి ఉన్న తన స్నేహితులను చూసి ఆటపట్టించాలని అనుకుంది.. అమ్మాయి స్నేహితుల దగ్గరికి రాగానే ఆగకుండా అలాగే ముందుకు దూసుకెళ్లింది. కాస్త ముందుకు వెళ్లిన తర్వాత తిరిగి వెనక్కి చూస్తూ టర్న్‌ చేయాలనుకుంది.. కానీ, పాపం తన ప్రయత్నం బెడిసి కొట్టింది. బండికి బ్రేకులు లేనట్టున్నయ్‌..తాను దిగబోతుండగానే స్కూటీ కాస్త అదుపుతప్పి ఫాస్ట్‌గా దూసుకెళ్లింది.

నిజానికి తాను స్టైల్‌గా బండిని తిప్పాలనుకుంది. స్కూటీ స్పీడ్ ని పూర్తిగా తగ్గించేసింది. దాంతో వాహనం ఒకవైపుకు ఒరిగిపోయింది. అమ్మాయి కూడా వెంటనే బండిని బ్యాలెన్స్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. కానీ అప్పటికే కంట్రోల్‌ తప్పిపోయింది. స్పీడ్‌ కంట్రోల్‌ కాకపోవడంతో అదుపు తప్పిన స్కూటీతో పాటు గోడను ఢీకొట్టింది. వీడియోలో సీన్‌ చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by memes comedy (@ghantaa)

అదే సమయంలో స్నేహితులను ఆటపట్టిస్తున్న అమ్మాయి గుండెల్లో గుబులు పుట్టించింది. ఈ వీడియో ఘంటా అనే పేజీలో ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేయబడింది. దీనిని ప్రజలు బాగా ఇష్టపడుతున్నారు. దీనికి ఇప్పటి వరకు వేల సంఖ్యలో లైక్స్, వ్యూస్ వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి